Om Raut: కొన్ని సినిమాలను ఎప్పటికీ మర్చిపోలేము. ఎంత మర్చిపోదాం అనుకున్నా కూడా వెంటాడుతూనే ఉంటాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్ళిపోయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. ఇప్పటికీ ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తారు.
బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి సెంటిమెంట్ ప్రభాస్ ను వెంటాడింది. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు కూడా ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే అన్నిటిని మించి ప్రభాస్ అభిమానులను బాగా డిస్టర్బ్ చేసిన సినిమా ఆది పురుష్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మినిమం ఆకట్టుకోలేదు.
దర్శకుడికి తిట్లు తప్పట్లేదు
ముఖ్యంగా ఆది పురుష్ సినిమా విషయంలో విఎఫ్ఎక్స్ పెద్ద కంప్లైంట్. చాలా నాసిరకమైన విఎఫ్ఎక్స్ ను ఆ సినిమా కోసం వాడారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏ సినిమాలో బాగున్నా కూడా, దర్శకుడు ఓం రౌత్ ను ట్విట్టర్ వేదికగా అందరూ తగులుకుంటారు. అసలు విజువల్స్ అంటే ఇవి అంటూ ట్రోల్ చేస్తారు. గతంలో హనుమాన్ ట్రైలర్ వచ్చినప్పుడు ఓం రౌత్ ను విపరీతంగా తగులుకున్నారు. ఇప్పుడు మిరాయి సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో విజువల్స్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలానే వి ఎఫ్ ఎక్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఈ తరుణంలో మరోసారి ఆది పురుష్ దర్శకుడు ఓం రౌత్ నెటిజెన్లు మళ్ళీ టార్గెట్ చేశారు.
కథ అలా మొదలైంది
దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ ను చేరడానికి మంచి మాస్టర్ ప్లాన్ వేశాడు. ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాముడు పాత్ర చేయాలని ఉంది రామాయణం అంటే తనకు చాలా ఇష్టమని ఒక సందర్భంలో చెబుతాడు. సరిగ్గా ఓం రౌత్ ఆ ఇంటర్వ్యూ చూసినట్లు ఉన్నాడు. అందుకోసమే ఏరి కోరి డైరెక్ట్ గా రామాయణం కథను ప్రభాస్ దగ్గరికి తీసుకొచ్చి సినిమా పట్టేసుకున్నాడు. ఆ ట్రైలర్ విడుదలైనప్పుడే చాలామంది గెటప్స్ మంచి ట్రోల్ కంటెంట్ వచ్చేసింది.
రావణాసురుడిని చూపించిన విధానంపై ఎక్కువగా ట్రోలింగ్ నడిచింది. విజువల్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. సినిమా అంతా కూడా గ్రీన్ మ్యాట్ లో ఫినిష్ చేశారు అన్న ఫీలింగ్ క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఏ గొప్ప సినిమా ట్రైలర్ విడుదలైన, దానిలో విజువల్స్ విపరీతంగా ఆకట్టుకున్న అదంతా కూడా దర్శకుడు ఓం రౌత్ కు శాపంగా మారుతుంది.
Also Read: Sankranthi 2026 Releases : సంక్రాంతికి సినిమాలు సెట్, పాపం రాజుగారి పరిస్థితి ఏంటి?