BigTV English

Maniratnam: అప్పుల బాధతో మణిరత్నం సోదరుడు మృతి.. 23 ఏళ్ల తర్వాత తీర్పునిచ్చిన హైకోర్టు

Maniratnam: అప్పుల బాధతో మణిరత్నం సోదరుడు మృతి.. 23 ఏళ్ల తర్వాత తీర్పునిచ్చిన హైకోర్టు

Maniratnam:దిగ్గజ దర్శక ధీరుడు మణిరత్నం (Maniratnam )గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన అద్భుతమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే ఈయన.. ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ సాధించలేదు అని చెప్పాలి. పొన్నియిన్ సెల్వన్ 1,2 చిత్రాలు చేసి పర్వాలేదు అనిపించుకున్న మణిరత్నం.. ఇటీవల కమలహాసన్(Kamal Haasan) తో ‘థగ్ లైఫ్’ సినిమా చేసి నిరాశపరిచారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది
. దీనికి తోడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల కారణంగా కర్ణాటకలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.


తప్పుడు పత్రాలు సమర్పించారని మణిరత్నం సోదరుడిపై కేసు ఫైల్..

ఇదిలా ఉండగా మణిరత్నం సోదరుడు ప్రముఖ నిర్మాత అప్పుల బాధతో మరణించగా.. ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వడం వైరల్ గా మారింది. 1996లో మణిరత్నం సోదరుడు తమిళ సినీ నిర్మాత జి. వెంకటేశ్వరన్(G.Venkateswaran ) .. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు లోన్ తీసుకున్నారంటూ.. బ్యాంకు ఫిర్యాదు చేయగా.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలు సమర్పించి.. రూ.10.19 కోట్లు బ్యాంకు నుంచి పొందినట్లు కేస్ ఫైల్ అయింది. సుమారు 30 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో తాజాగా చెన్నై ప్రత్యేక కోర్ట్ తీర్పునిచ్చింది.


23 ఏళ్ల తర్వాత చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పు..

ముఖ్యంగా బ్యాంకును మోసం చేసిన కేసులో మొత్తం తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించారు. కానీ వెంకటేశ్వరన్ తోపాటు మరో ముగ్గురు బ్యాంక్ అధికారులు మరణించడంతో వారిపై ఉన్న అభియోగాలు ఇప్పటికే కొట్టి వేయబడ్డాయి. కేసుతో సంబంధం ఉన్న మిగిలిన ఐదుగురు పరిస్థితి గురించి తెలుసుకోవాలని అధికారులను కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనా 2003లో జి. వెంకటేశ్వరన్ అప్పుల బాధతో మరణిస్తే.. 23 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వడం వైరల్ గా మారింది.

ఆత్మహత్య చేసుకున్న మణిరత్నం సోదరుడు..

మణిరత్నం అన్నయ్య వెంకటేశ్వరన్ పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా మౌనరాగం నుంచి దళపతి వరకు మణిరత్నం దర్శకత్వం వహించిన పలు హిట్టు చిత్రాలకు జీవి ప్రొడ్యూసర్ గా ఆయన వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత నిర్మించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో.. అప్పుల బాధ తాళలేక 2003 మే మూడవ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల ఒత్తిడి.. నిర్మాతల నుంచి అప్పులు తీసుకొని సినిమాలను నిర్మించినా.. వాటి నుంచి వచ్చిన నష్టాలను తట్టుకోలేకపోయారని.. పైగా ఆ సమయంలో ఎవరు సహాయం చేయలేదని, తమిళ నిర్మాత మాణిక్యం నారాయణన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. పైగా కొడుకు పెళ్లి సమయంలో కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. అలా అప్పుల బాధలు తట్టుకోలేక తన జీవితాన్ని ముగించుకున్నారని సమాచారం.

ALSO READ:Sundarakanda Collection : నారా రోహిత్ మూవీకి ఘోర పరాభవం… ఫస్ట్ డే అరకోటి కూడా రాలే ?

Related News

OG Film Talk: ఓజీ కథనంపై అనుమానాలు… మళ్లీ వీరమల్లు రిజల్టేనా ?

Akhanda 2: ఇట్స్ అఫీసియల్… పోటీ నుంచి తప్పుకున్న బాలయ్య… ఇక ఓజీ ఒంటరిగానే

S.V.Krishna Reddy: వేదవ్యాస్ గా రాబోతున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. హీరోయిన్ గా కొరియన్ నటి

Dil Raju : రాజుగారిని ఆదుకోవాలంటే… ప్రతి సారి పవనేశ్వరుడే రావాలా ?

Om Raut: ఇదేం కర్మ రా బాబు, సినిమా వచ్చి వెళ్లిపోయిన ఈ దర్శకుడికి తిట్లు మాత్రం తప్పట్లేదు

Big Stories

×