BigTV English

Kingdom OTT: ఇక్కడ కూడా అభిమానులకు నిరాశే..

Kingdom OTT: ఇక్కడ కూడా అభిమానులకు నిరాశే..

Kingdom OTT: కొన్ని సినిమాలు థియేటర్లో ఆశించిన ఫలితాన్ని ఆంచించలేకపోయినా.. ఓటీటీలో అయినా మంచి విజయాన్ని అందుకుంటాయి. కనీసంలో కనీసం పాజిటివ్ టాక్ ను అయినా తెచ్చుకుంటాయి. కానీ, కింగ్డమ్  ఓటీటీలో కూడా నిరాశనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన చిత్రం కింగ్డమ్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఎన్ని వాయిదాల తరువాత జూలై 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది.


ఎన్నో అంచనాల మధ్య రిలీజైన కింగ్డమ్ భారీ పరాజయాన్ని అందుకుంది. గౌతమ్ నుంచి ఇలాంటి కథను ఊహించలేదని, అసలు కథ ఎటు నుంచి ఎటు పోతుందో తెలియడం లేదని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. అందులో హృదయం లోపల సాంగ్ ను కట్ చేశారు. సగానికి సగం మంది ప్రేక్షకులు ఆ సాంగ్ కోసమే సినిమాకు వెళ్లారు. కానీ, ఆ సాంగ్ లేకపోవడంతో ఎంతో నిరాశకు గురయ్యారు. అది పెట్టి ఉంటే కనీసం లో కనీసం కలక్షన్స్ అయినా వచ్చేవి అని కామెంట్స్ చేశారు.

ఇక ఈమధ్య కాలంలో థియేటర్ లో యాడ్ చేయని సీన్స్, సాంగ్స్ ను ఓటీటీలో యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీనివలన ఓటీటీలో అయినా పాజిటివ్ టాక్ వస్తుంది అని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. కొన్ని సినిమాలకు అది కలిసి వచ్చింది కూడా. ఇక కింగ్డమ్ సినిమా ఆగస్టు 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఓటీటీలో అయినా హృదయం లోపల సాంగ్ ను యాడ్ చేసి ఉంటారని అనుకున్న ప్రేక్షకులకు ఇక్కడ కూడా నిరాశే మిగిలింది. ఆ సాంగ్ ను ఓటీటీలో కూడా రిలీజ్ చేయలేదు.


భాగ్యశ్రీ ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ సమయంలో, ఈ సాంగ్ లో ఆమె పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చూపించారు. కానీ, సినిమాలో అసలు భాగ్యశ్రీ ఎందుకు ఉన్నదో కూడా తెలియలేదు. కనీసం ఈ సాంగ్ ను, డిలేటెడ్ సీన్స్ ను యాడ్ చేస్తే ఓటీటీలో అయినా పాజిటివ్ టాక్ ను తెచ్చుకొనేది. ఇక్కడ అయిన భాగ్యశ్రీకి కొద్దిగా గుర్తింపు వచ్చేది అని మండిపడుతున్నారు.

సాధారణంగా ఓటీటీకి వచ్చాక కూడా స్టార్ హీరోల మూవీస్ గురించి చర్చలు జరుగుతాయి. ఎందుకంటే.. కొత్త సీన్స్, సాంగ్స్ యాడ్ చేయడంతో ఆ సినిమా కథ మారిపోతుంది. ఇక కింగ్డమ్ ఓటీటీలోకి వచ్చినా ఎవరూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేయడం లేదు. ఎందుకంటే అంత చర్చించుకొనే విషయాలేమి కొత్తగా ఇందులో లేవు కాబట్టి. థియేటర్ లో ఎలా అయితే పరాజయాన్ని అందుకుందో .. ఓటీటీలో కూడా ఎలాంటి టాక్ లేకుండా సైలెంట్ గా ఉండిపోయింది. మరి ముందు ముందు ఏమైనా ఈ సినిమా చప్పుడు చేస్తుందేమో చూడాలి.

Related News

Akhanda 2: ఇట్స్ అఫీసియల్… పోటీ నుంచి తప్పుకున్న బాలయ్య… ఇక ఓజీ ఒంటరిగానే

S.V.Krishna Reddy: వేదవ్యాస్ గా రాబోతున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. హీరోయిన్ గా కొరియన్ నటి

Dil Raju : రాజుగారిని ఆదుకోవాలంటే… ప్రతి సారి పవనేశ్వరుడే రావాలా ?

Maniratnam: అప్పుల బాధతో మణిరత్నం సోదరుడు మృతి.. 23 ఏళ్ల తర్వాత తీర్పునిచ్చిన హైకోర్టు

Om Raut: ఇదేం కర్మ రా బాబు, సినిమా వచ్చి వెళ్లిపోయిన ఈ దర్శకుడికి తిట్లు మాత్రం తప్పట్లేదు

Big Stories

×