BigTV English
Advertisement

Tollywood: ఈగోలకు పోయి చిక్కుల్లో పడ్డ సెలబ్రిటీస్.. సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న స్టార్స్..!

Tollywood: ఈగోలకు పోయి చిక్కుల్లో పడ్డ సెలబ్రిటీస్.. సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న స్టార్స్..!

Tollywood:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొంతమంది సినీ సెలబ్రిటీలు గొప్పలకి పోయి చేసే కామెంట్లు.. తర్వాత వారిని చిక్కుల్లో పడేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. మరి కొంతమంది ఈగోలను ప్రదర్శించి, విమర్శల పాలవుతూ ఉంటారు. ఇక అలాంటివారిలో అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న (Rashmika mandanna) కూడా ఒకరు అని నెటిజన్లు తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరూ ఈగోల కారణంగానే ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారని, వీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన సక్సెస్ లభించినా.. దానిని సంతోషంగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇక అలా అల్లు అర్జున్, రష్మిక చేసిన తప్పిదం ఏమిటి? వారికి అంత సక్సెస్ లభించినా సంతోషంగా ఎంజాయ్ చేయలేకపోవడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


ఈగో కారణంగా చిక్కుల్లో పడ్డ అల్లు అర్జున్..

అల్లు అర్జున్, సుకుమార్(Sukumar )దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.మూడేళ్ల పాటు నిర్విరామంగా శ్రమించి, గత ఏడాది ‘పుష్ప 2’ సినిమాతో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ ఉంది. ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి. కానీ అల్లు అర్జున్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ప్రదర్శించిన పుష్ప2 బెనిఫిట్ షో చూడడానికి కుటుంబ సభ్యులతో వచ్చారు. అయితే కామ్ గా వచ్చి సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే సమస్య ఉండేది కాదు.. కానీ ఆయన పోలీసుల పర్మిషన్ లేకుండానే ర్యాలీ నిర్వహించారు. దీనికి తోడు ప్రైవేట్ బౌన్సర్లను తెచ్చుకున్నారు. ఇక అభిమానులు అల్లు అర్జున్ ను చూడడానికి ఎగబడడంతో బౌన్సర్లు వారిపై కర్రలతో దాడి చేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ఏకంగా ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకు శ్రీ తేజ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. ఫలితంగా కోర్టు, పోలీసులు , జైలు అంటూ తిరిగారు అల్లు అర్జున్. ఈయన నటించిన పుష్ప 2 సినిమా సక్సెస్ సాధించి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్ల సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. కానీ ఈ సక్సెస్ ను మాత్రం అల్లు అర్జున్ ఎంజాయ్ చేయలేకపోయారు.


సొంత ఊరును మరిచి చిక్కుల్లో పడ్డ రష్మిక మందన్న..

రష్మిక మందన్న పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా భారీ పాపులారిటీ అందుకుంది. ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో విక్కీ కౌశల్(Vicky kaushal), లక్ష్మణ్ ఉటేకర్ (Lakshman utkar) కాంబినేషన్లో శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘ఛావా’ సినిమాలో శంభాజీ మహారాజ్ భార్య యేసుభాయ్ క్యారెక్టర్ లో నటించింది. ఇందులో రష్మిక ఒదిగిపోయి నటించిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన వంతు ప్రమోట్ చేసి సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ సినిమా మూడు రోజుల్లోనే దాదాపు రూ.120 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది.. అయితే ఈ సంతోషాన్ని ఆమె ఎంజాయ్ చేయలేకపోతోంది. దీనికి కారణం ఛావా ప్రమోషన్స్ లో భాగంగా తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పింది. వాస్తవానికి ఆమె కర్ణాటక ప్రాంతానికి చెందింది.దీనితో కన్నడిగుళు ఆమెపై మండిపడుతున్నారు. పుట్టిన ఊరు పేరు చెప్పుకోవడానికి ఎందుకంత నామోషి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వరుస ట్వీట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా వీరిద్దరూ ఈగోలకు పోయి ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×