E-Paper
Advertisement

Singapore Airlines: విమానంలో భారీ కుదుపులు.. ఒకరు మృతి, 30 మందికి గాయాలు!

Singapore Airlines: విమానంలో భారీ కుదుపులు.. ఒకరు మృతి, 30 మందికి గాయాలు!
Advertisement

1 Dead, 30 Injured in Singapore Airlines Trubulence: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చిందిన విమానం గాల్లో ఉండగానే తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా సుమారు 30 మంది గాయపడినట్లు తెలుస్తోంది. లండన్ నుంచి సింగపూర్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఎయిర్ లైన్స్ వెల్లడించింది.

సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777- 300ER విమానం 211 మంది ప్రయాణికులు, 18 విమాన సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్ బయలు దేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం తీవ్ర కుదుపులకు లోనైనట్టు ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అనంతరం ప్లైట్ ను బ్యాంకాక్ మళ్లించినట్లు ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో సువర్ణభూమి ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు పేర్కొంది.

Advertisement

అయితే ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మరణించగా, సుమారు 30 మంది గాయపడినట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది. ఈ మేరకు మృతి చెందిన కుటుంబానికి సంతాపం ప్రకటించింది. అంతే కాకుండా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించే విషయంపై థాయ్ లాండ్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపింది.

Also Read: సింగపూర్ లో కోవిడ్ కలకలం.. వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు!

Advertisement

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×