E-Paper
Advertisement

Canada flight: విమానానికి తప్పున పెను ప్రమాదం.. గాల్లో ఉండగానే మంటలు

Canada flight: విమానానికి తప్పున పెను ప్రమాదం.. గాల్లో ఉండగానే మంటలు
Advertisement

Canada Flight: ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా కుడివైపు ఇంజన్‌లో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని ఎయిర్ పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు.

ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఎయిర్ పోర్టు నుంచి టేక్‌ఆఫ్ అయిన వెంటనే విమానం రెక్కల దగ్గర మంటలు వ్యాపించాయి. దీంతో ఫైలట్ టేక్‌ఆఫ్ అయిన 30 నిమిషాల్లోనే ఫ్లైట్‌ను ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన సందర్భంలో విమానంలో ప్రయాణికులతో పాటు , సిబ్బంది కలిపి మొత్తం 400 మంది ఉన్నారు.

Advertisement

అంతే కాకుండా ఘటన జరిగిన సమయంలో విమానంలోని ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయి. మరో పక్క వాతావరణం కూడా అనుకూలంగా లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య సురక్షితంగా ఫ్లైట్‌ను ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసిన పైలట్‌ను అందరూ అభినందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఎయిర్ కెనడా స్పందిస్తూ.. విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను సేఫ్‌గా మరో విమానంలో పంపిచామని తెలిపారు.

Also Read: తీవ్ర కలకలం.. ఏకంగా దేశ ప్రధానిపై వ్యక్తి దాడి..

Advertisement

ఇంజన్ కంప్రెసర్ సమస్య వల్లే మంటలు చెలరేగాయని కెనడా ప్రతినిధి వివరణ ఇచ్చారు. సమస్యను పూర్తిగా పరిష్కరించిన తర్వాతే ఫ్లైట్‌ను తిరిగి సేవల కోసం వినియోగిస్తామని అన్నారు. ఫైలట్ ఎంతో తెలివిని ప్రదర్శించి విమానాన్ని తిరిగి సురక్షితంగా ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారని అన్నారు.

 

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×