BigTV English

Amy Tripp Star Astrologer: అమెరికాలోనూ..వేణుస్వామి వారసురాలు? ఎవరు గెలుస్తారో చెప్పేసింది

Amy Tripp Star Astrologer: అమెరికాలోనూ..వేణుస్వామి వారసురాలు? ఎవరు గెలుస్తారో చెప్పేసింది

Amy Tripp Star Astrologer Predicts U.S.president winner donald Trump: రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా జాతకాలపై క్రేజ్ పెరిగిపోతోంది. సరిగ్గా ఎన్నికల సమయంలో పుట్టుకొస్తుంటారు జ్యోలిష్యులు. ఫలానా అభ్యర్థి గెలుస్తాడని.. ఫలానా వ్యక్తి ఓడిపోతాడని చెబుతుంటారు. ఒక వేళ వీళ్లు చెప్పింది జరిగిందో ఇక వీళ్లను జనం ఆకాశానికి ఎత్తేస్తుంటారు. తెలుగు రాష్ట్రాలలో వివాదాల స్వామి వేణుస్వామి తాను కూడా నాగచైతన్య, సమంతలు విడిపోతారని చెప్పి ఒక్కసారిగా వార్తలలోకి ఎక్కేసిన వేణుస్వామి తర్వాత వివాదాస్పద జాతకాలు చెప్పి చిక్కుల్లో ఇరుక్కున్నారు. పబ్లిసిటీ కోసం వీళ్లు నోటికొచ్చింది చెప్పేస్తుంటారు. ఒక్కో సందర్భంలో అవి కాస్తా తప్పని తేలితే ఇక జనం వీళ్లను ఆరేసుకుంటారు. అయితే అమెరికాలోనూ వేణు స్వామి వారసురాలు ఒకరు తయారయ్యారు. ఆమె పేరు అమీట్రిప్.


భారతీయ ఓటర్లే కీలకం

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్,రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ అధ్యక్ష బరిలో ఉన్నారు. అమెరికా రాజకీయాలు రోజుకో వార్తతో కీలక మలుపులు తిరుగుతున్నాయి. 78 సంవత్సరాల ట్రంప్ కు 59 ఏళ్ల కమలాహారిస్ గట్టిపోటీ ఇస్తున్నారు. ఇప్పటిదాకా సరళి గమనిస్తే కమలాహారిస్ ట్రంప్ కన్నా ముందున్నారు. జో బిడెన్ అధ్యక్ష బరిలో ఉండగా ట్రంప్ దే పై చేయిగా ఉండేది. అనూహ్యంగా కమలాహారిస్ పేరు తెరపైకి రావడంతో ఆమెకు మద్దతుదారులు భారీగానే పెరిగారు. ముఖ్యంగా అమెరికా ఓట్లపై ప్రభావం చూపే భారతీయ అమెరికన్లు ఓట్లు అక్కడ కీలకంగా మారనున్నాయి.ఓ పక్క వీరి గెలుపుపై అమెరికాలో ఉత్కంఠకర రాజకీయాలు నడుస్తుండగా అమీట్రిప్ ఓ బాంబు పేల్చింది.


ట్రంప్ విజయం తథ్యం

రాబోయే ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ గెలువబోతున్నారని ప్రకటించింది. గతంలో అమీ ట్రిప్ జోబిడెన్ అనారోగ్యానికి గురవుతాడని.. అనూహ్యంగా ఎన్నికల బరినుండి తప్పుకుంటాడని.. అది ఫలానా నెలలో జరుగుతుందని చెప్పింది. సరిగ్గా అమీట్రిప్ చెప్పిన సంఘటనలు అన్నీ జరగడంతో అప్పటినుంచి ఈమె పేరు అమెరికా దేశంలో మార్మోగుతోంది. ఇప్పుడు కూడా తాను చెప్పింది జరగబోతోందని.. డొనాల్డ్ ట్రంప్ విజయం తథ్యమని అంటోంది. కాకపోతే ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాలో పలు కీలక మార్పులు సంభవిస్తాయని అంటోంది. అల్లర్లు, ఆందోళనలు కూడా పద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని అంటున్నారు ఆమె. అమీట్రిప్ ప్రకటనతో డెమోక్రాట్స్ మండిపడుతున్నారు. అది నమ్మదగినదిగా లేదని.. కేవలం పబ్లిసిటీ గిమ్మిక్కు అని కొట్టిపారేస్తున్నారు. ట్రంప్ కు అమీట్రిప్ అమ్ముడుపోయి అలా మాట్లాడుతోందని అంటున్నారు. రిపబ్లికన్స్ మాత్రం అమీ చెప్పింది వంద శాతం నిజమవుతుందని.. గతంలో ఆమె చెప్పిన సంఘటనలు జరిగాయని అంటున్నారు. అంటే వేణుస్వామి లాంటి జాతక పురుషులు, స్త్రీలు అన్ని దేశాలలోనూ ఉంటారన్నమాట అని కామెంట్స్ చేస్తున్నారంతా.

 

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×