BigTV English

Parliament: పార్లమెంట్ ఆవరణలో మరోసారి భద్రతా వైఫల్యం..పోలీసుల అదుపులోకి!

Parliament: పార్లమెంట్ ఆవరణలో మరోసారి భద్రతా వైఫల్యం..పోలీసుల అదుపులోకి!

Man scales wall jumps inside Parliament Annexe: పార్లమెంట్ ఆవరణ తీవ్ర భద్రతా వైపల్యం చోటుచేసుకుంది. ఓ యువకుడు పార్లమెంట్ గోడ దూకి లోపలికి చొరబడేందుకు యత్నించాడు. అనెక్స్ భవన ప్రాంగణంలోని గోడను దూకి ఓ యువకుడు లోపలికి ప్రవేశించాడు. ఈనెల 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎప్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.


నిందితుడు యూపీకి చెందిన మనీశ్ గా గుర్తించామని, అతడి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

ఎత్తుగా ఉన్న గోడను అతడు ఎలా ఎక్కాడు ఎందుకు పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రేవేశించాడన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించినట్లు వెల్లడించారు. దీంతోపాటు సీసీ ఫుటేజీని సైతం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.


Also Read: కోల్‌కతా ఘటనపై స్పందించిన నిర్భయ తల్లి.. షాక్‌లో సీఎం మమతా బెనర్జీ?

ఇదిలా ఉండగా, ఇటీవల ఇద్దరు దుండగులు పార్లమెంట్ లోపలికి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. గతంలో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. డిసెంబర్ 13న ఈ ఘటన జరగగా.. ఇప్పటికీ 22 ఏళ్లు అయింది. లోక్ సభలోని పబ్లిక్ గ్యాలరీ వద్ద కూర్చున్న ఇద్దరు యువకులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×