BigTV English

Bhagawadgita – Jews : భగవద్గీత ఒక అసహ్యకర, అశ్లీల గ్రంథం : స్లోవేనియా తత్వవేత్త

Bhagawadgita – Jews : హిందువులకు పవిత్ర గ్రంథమైన భగవద్గీతను ఒక స్లోవేనియా తత్వవేత్త ఒక ఒక అసహ్యకర, అశ్లీల గ్రంథం అని అభిప్రాయపడ్డారు. స్లోవేనియా దేశానికి చెందిన తత్వవేత్త స్లావోజ్ జిజెక్ ఇటీవల భగవద్గీతపై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ గ్రంథం అత్యంత అసభ్యకరమైన, అసహ్యకరమైన పవిత్ర పుస్తకాలలో ఒకటిగా వ్యాఖ్యానించాడు.

Bhagawadgita – Jews : భగవద్గీత ఒక అసహ్యకర, అశ్లీల గ్రంథం : స్లోవేనియా తత్వవేత్త

Bhagawadgita – Jews : హిందువులకు పవిత్ర గ్రంథమైన భగవద్గీతను ఒక స్లోవేనియా తత్వవేత్త ఒక ఒక అసహ్యకర, అశ్లీల గ్రంథం అని అభిప్రాయపడ్డారు. స్లోవేనియా దేశానికి చెందిన తత్వవేత్త స్లావోజ్ జిజెక్ ఇటీవల భగవద్గీతపై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ గ్రంథం అత్యంత అసభ్యకరమైన, అసహ్యకరమైన పవిత్ర పుస్తకాలలో ఒకటిగా వ్యాఖ్యానించాడు.


ఇటీవల ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తీసిన ఓపెన్ హెయిమర్ అనే ఇంగ్లీష్ సినిమాలో కథానాయకుడు ఒక మహిళతో సెక్స్ చేస్తున్న సందర్భంలో ఆమె భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చదవమని చెబుతుంది. ఆ సీన్ చూసిన భారతీయ ప్రేక్షకులు సోషల్ మీడియాలో చాలా విమర్శలు చేశారు. అలాంటి పవిత్ర గ్రంథం గురించి ఒక శృంగార సీన్‌ నడుస్తున్న సమయంలో చూపించడం సరికాదు అని అభిప్రాయపడుతున్నారు.

తత్వవేత్త స్లావోజ్ జిజెక్ కూడా ముందుగా ఈ ఓపెస్ హెయిమర్ సినిమా సీన్ గురించి ప్రస్తావిస్తూ.. అలాంటి అందమైన సెక్స్ సీన్‌లో భగవద్గీత లాంటి అశ్లీల, అసహ్యకర పుస్తకం గురించి ప్రస్తావన తీసుకురావడం వల్ల ఆ సీన్ పాడైపోయిందని చెప్పాడు. అంతటితో ఆగలేదు. భగవద్గీత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను హిట్లర్ నాజీ పాలనలో ఒక ప్రముఖ వ్యక్తి హెన్రిచ్ హిమ్లర్‌ వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఖండించాడు.


హిట్లర్ లక్షల మంది యూదులను చంపే బాధ్యతను తన సహచరుడు హెన్రిచ్ హిమ్లర్‌కు అప్పగించాడు. ఆ హెన్రిచ్ హిమ్లర్‌ అంతమంది యూదులను చంపేందుకు భగవద్గీతలోని శ్లోకాలను ఉపయోగించుకున్నాడని స్లావోజ్ జిజెక్ తెలిపారు. యూదుల హత్యాఖండకు నైతిక సమర్థనగా హిమ్లర్ భగవద్గీతను ప్రస్తావించారని జిజెక్ ఆరోపించారు. మానత్వాన్ని కోల్పోకుండా హేయమైన చర్యలకు పాల్పడే ప్రశ్నకు సమాధానంగా దీనిని రూపొందించారని ఆయన వ్యాఖ్యానించారు.

యూదులను లక్షల సమూహంలో హతమారుస్తున్నప్పుడు హిమ్లర్ ఈ విధంగా చెప్పాడు. “మనం భయంకరమైన పనులు చేస్తున్నాము.. యూదు పిల్లలను , ఇతరులను చంపుతున్నాం, మనమే మృగాలుగా మారకుండా ఈ పని ఎలా చేయగలం, భగవద్గీతను మనం మార్గదర్శకంగా తీసుకోవాలి,” అని హిమ్లర్ అన్నాడు. హిమ్లర్ ఆ సమయంలో భగవద్గీతను ఉదాహరణగా చూపిన సంగతి తత్వతేత్త జిజెక్ ప్రస్తావిస్తూ భగవద్గీతను అసహ్యకరమైన గ్రంథమని చెప్పాడు.

భగవద్గీత శ్లోకాలను వక్రీకరించి తన చర్యలను సమర్థించుకున్న హిమ్లర్‌ను విమర్శించాల్సిందిపోయి.. అసలు పవిత్ర గ్రంథమే హత్యలు చేయమని ప్రోత్సహిస్తోందని చెప్పడం ఒక తత్వవేత్త అయిన జిజెక్ చేసిన తప్పు. ఆయన భగవద్గీతను సరిగా అర్థం చేసుకోకుండా యూదుల నరమేధంతో ముడిపెట్టడమనేది ఏమాత్రం సమర్థనీయం కాదు.

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×