BigTV English

surfer : 13 మీటర్ల అలపై స్వారీ .. లారా రికార్డు

surfer : 13 మీటర్ల అలపై స్వారీ .. లారా రికార్డు
Surfer Laura Enver

surfer : ఆస్ట్రేలియన్ సర్ఫర్ లారా ఎన్వర్ అరుదైన రికార్డు సాధించింది. 13.3 మీటర్ల ఎత్తైన రాకాసి అలపై అవలీలగా స్వారీ చేసింది. హవాయి దీవుల్లో ఆమె సాధించిన ఈ ఫీట్ ఎనిమిదేళ్ల నాటి రికార్డులను చెరిపేసింది. బ్రెజిలియన్ సర్ఫర్ ఆండ్రియా మోల్లెర్ 12.8 మీటర్ల మేర ఎగసిన అలను అధిరోహించగలిగింది. తాజాగా లారా ఆ రికార్డును అధిగమించిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు వెల్లడించారు.


భారీ అలలపై స్వారీ అంటే సర్ఫర్లు సాధారణంగా జెట్-స్కీ సాయం తీసుకుంటారు. అలాంటి సాయం లేకుండానే 13.3 మీటర్ల అలను సర్ఫింగ్ చేసిన తొలి మహిళగా లారా రికార్డుల్లోకి ఎక్కింది. సిడ్నిలోని నారబీన్ సబ్బర్బ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అరుదైన ఫీట్ సాధించిన లారాకు గిన్నిస్ నిర్వాహకులు సర్టిఫికెట్ అందజేశారు.

ఆమె పెరిగింది, సర్ఫింగ్‌లో మునిగి తేలిందీ నారాబీన్‌లోనే. 11వ ఏట నుంచే ఈ జలక్రీడపై మోజు పెంచుకుంది. పలు జూనియర్ పోటీల్లో విజయాలను వశం చేసుకుంది. అనంతరం వరల్డ్ సర్ప్ లీగ్(WSL) చాంపియన్‌షిప్ టూర్‌లో ఏడేళ్లు పాల్గొంది. ఆపై రాకాసి అలల పని పట్టడంలో నిమగ్నమైంది. అంత పెద్ద అలను రైడ్ చేస్తున్న లారాను వీడియో తీశారు. దాని సాయంతో గిన్నిస్ నిర్వాహకులు అల ఎత్తుతో పాటు ఇతర వివరాలను కచ్చితంగా తెలుసుకోగలిగారు.


Related News

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Big Stories

×