BigTV English

BlackRock says: ట్రంప్ హత్యాయత్నం ఇష్యూ, దుండగుడి యాడ్ తొలగించిన బ్లాక్‌రాక్

BlackRock says: ట్రంప్ హత్యాయత్నం ఇష్యూ, దుండగుడి యాడ్ తొలగించిన బ్లాక్‌రాక్

BlackRock says: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ హత్యాయత్నం కేసులో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనకు పాల్పడిన దుండగుడ్ని సీక్రెట్ సర్వీసు పోలీసులు మట్టుబెట్టారు. అయితే నిందితుడు ఎలా ఉంటాడో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. కాకపోతే నిందితుడు యువకుడిగా ఉన్న ఫోటో మాత్ర సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఫోటోకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.


నిందితుడు 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఓ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజ కంపెనీ రూపొందించిన యాడ్‌‌లో నటించాడు. కాల్పుల ఘటన తర్వాత అందులోని ఫోటో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో ఆ యాడ్‌ను సదరు సంస్థ తొలగించింది.

ఇంతకీ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఎవరిది? ప్రపంచంలో అతిపెద్ద మనీ మేనేజింగ్ సంస్థ బ్లాక్‌రాక్ రెండేళ్ల కిందట ఓ యాడ్ రూపొందించింది. పెన్విల్వేనియాలోని బెతెల్‌పార్క్ హైస్కూల్‌‌లో దాన్ని షూట్ చేశారు.
ఆ స్కూల్‌లోని కొందరు విద్యార్థులు అందులో నటించాడు. వారిలో థామస్ మాథ్యూ క్రూక్స్ ఉన్నాడు. ట్రంప్‌పై కాల్పుల తర్వాత ఆ యాడ్‌లోని ఫోటో వైరల్ అయ్యింది. ఘటన తర్వాత ఆ కంపెనీ తన యాడ్ ను తొలగించింది. అధికారులకు ఈ వీడియో అందుబాటులో ఉండదని చెప్పింది.


బెతెల్ పార్క్ స్కూల్ నుంచి 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు థామస్. పాఠశాలలో మేథ్స్ సబ్జెక్టులో చురుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నేషనల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇనీషియేటివ్ నుంచి 500 డాలర్ల అవార్డును అందుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. డిగ్రీ తర్వాత ఓ నర్సింగ్‌ హోమ్‌లో పని చేస్తున్నాడు.

ALSO READ:  కాల్పులపై స్పందించిన ట్రంప్

థామస్ పాఠశాలలో ఉన్నప్పుడు తొటి విద్యార్థుల నుంచి వేధింపులు ఎదుర్కొనేవాడని క్లాస్‌మేట్ ఒకరు తెలిపాడు. ఎప్పుడు మౌనంగా ఉండేవాడని, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవాడని వెల్లడించాడు. ట్రంప్ గురించి, రాజకీయాల గురించి థామస్ మాట్లాడడం తాను వినలేదని, అతడు వేసుకునే దుస్తులను కొందరు గేలి చేనేవారని వివరించారాయన.

 

Related News

Greece Population: గ్రీస్ లో జనాభా సంక్షోభం.. పిల్లలు లేక స్కూల్స్ మూసివేత

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Modi Putin BIG Meeting: నిన్న జిన్‌పింగ్, ఇవాళ పుతిన్‌తో.. మోదీ బిగ్ మీటింగ్స్..

Trump Tariffs: కత్తులు నూరుతూ.. భారత్ పై ట్రంప్ లాస్ట్ అస్త్రం ఇదేనా!

Afghanistan Earthquake: ఆఫ్థాన్‌లో వరుస భూకంపాలు, మృతులు 250 మందికి పైగానే?

Big Stories

×