BigTV English

Kazakhstan Ex Minister: మాజీ మంత్రి ఘాతుకం: భార్య జుట్టు పట్టి ఈడ్చికెళ్తూ.. ఇష్టానుసారంగా తన్ని..

Kazakhstan Ex Minister: మాజీ మంత్రి ఘాతుకం: భార్య జుట్టు పట్టి ఈడ్చికెళ్తూ.. ఇష్టానుసారంగా తన్ని..

Kazakhstan Ex Minister Beats His Wife to Leads Death: ఆయనొక మాజీ మంత్రి.. ఓ ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా అతను దారుణానికి ఒడిగట్టాడు. హోటల్ రూంలో తన భార్య జుట్టు పట్టి ఈడ్చుకెళ్లాడు.. ఇష్టానుసారంగా తన్నుతూ సుమారుగా 8 గంటలపాటు ఆమెకు నరకం చూపించాడు. రక్తపు మడుగుల్లో ఆమె పడి ఉండడం గమనించిన హోటల్ సిబ్బంది ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయినా కూడా అతను ఆమె బాగానే ఉందంటూ బుకాయించాడు.


చివరగా అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. అయితే ఆమె అప్పటికే మృతిచెందిందని వైద్యులు తేల్చిచెప్పారు. పోస్ట్ మార్టమ్ రిపోర్టులో కూడా ఆమె ముక్కు, తల, శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ దేశం అట్టుడుకిపోతోంది.

ఇందుకు సంబంధించి వస్తున్నటువంటి పలు వార్తా కథనాల ప్రకారం.. కువాన్ దిక్ బిషింబయెవ్ అనే వ్యక్తి కజకస్తాన్ దేశానికి సంబంధించిన మాజీ ఆర్థిక మంత్రి. అయితే.. ఆయన, ఆయన సతీమణి ఇద్దరూ కలిసి గతేడాది నవంబర్ లో ఆయన బంధువుల పేరిట ఉన్నటువంటి ఓ హోటల్ కు వెళ్లారు. ఒక రోజంతా కూడా వారు ఆ హోటల్ లోనే ఉన్నారు. అయితే ఆయన సతీమణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆయనను విచారించగా తన భార్యను తానే దారుణంగా హింసించి హత్యచేసినట్లుగా తేలింది. ఈ క్రమంలో ఆయన కోర్టు విచారణను ఎదుర్కొంటున్నాడు.


Also Read: నర్సు కాదు ఓ కిల్లర్.. 700 ఏళ్ల జైలు

అయితే, ఇందుకు సంబంధించి హోటల్ సీసీ టీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. అతను తన భార్యను ఎంత దారుణంగా హింసించి చంపాడో అందులో వాయిస్ తో సహా రికార్డయ్యింది. జుట్టుపట్టి ఈడ్చికెళ్తూ ఇష్టానుసారంగా తన్నుతూ.. అలా ఏకంగా 8 గంటలపాటు ఆమెకు నరకం చూపించాడు. ఆమె తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్నప్పటికీ.. ఆమెకు ఏం కాలేదు.. బాగానే ఉందంటూ హోటల్ సిబ్బందితో బుకాయించాడు. ఇందుకు సంబంధించిన ఆడియో కూడా అందులో రికార్డయినట్లు వార్తలు వస్తున్నాయి. సిబ్బంది ఎంత ప్రయత్నించినా అలానే బుకాయించసాగాడు. చివరకు కొన్ని గంటల తరువాత అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. అయితే, ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తేల్చి చెప్పారు.

వీడియో ఫుటేజీ బయటకు రావడంతో అతడి దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారంటూ ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారు. అయితే, ఈ కేసు ప్రస్తుతం ఆ దేశపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×