Big Stories

Killer Nurse Sentenced: వామ్మో నర్సు కాదు.. ఓ కిల్లర్ హత్యలు, హత్యాయత్నాల లిస్ట్.. 700 ఏళ్ల జైలు శిక్ష..!

Killer Nurse Sentenced for 700 Years: కనిపిస్తున్న ఆమె పేరు హీథర్ ప్రెస్‌డీ.. వయస్సు 41 ఏళ్లు, వృత్తి నర్సు. ఈ  ఉపోద్ఘాతం ఏంటని అనుకుంటున్నారా? ఏమీలేదు.. కాకపోతే ఈమెకు న్యాయస్థానం ఏకంగా 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదేదో పెద్ద కేసులా కనిపిస్తోంది కదూ. అక్కడికే వచ్చేద్దాం.

- Advertisement -

అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన ఈ నర్సు గడిచిన మూడేళ్ల కిందట 17 మంది రోగులను చంపే సింది. అంతేకాదు ముగ్గుర్ని హత్య చేసింది. అంతేకాదు 19 హత్యాయత్నాలు కూడా ఉన్నాయి. 2020 నుంచి 2023 వరకు వివిధ హెల్త్ సెంటర్లలో హీథర్ పని చేసింది. నర్సు అంటే జీతం బాగానే ఉంటుంది. మరి ఈమెలో ఏ మార్పు వచ్చిందో తెలీదుగానీ ఆసుపత్రికి వచ్చే రోగులకు మోతాకు మించిన ఇన్సులిన్ ఇచ్చేది. మొత్తం 22 మందికి అధికంగా ఇచ్చింది. అధిక ఇన్సులిన్ కారణంగా 17 మంది రోగులు చనిపోయారు. ముగ్గుర్ని హత్య చేసినట్టు ఒప్పేసుకుంది.

- Advertisement -

శనివారం ఆమె అక్కడి న్యాయస్థానం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హీథర్ హత్యల గురించి బయట ప్రపంచానికి ఎలా తెలిసింది. ఇద్దరు పేషెంట్లను చంపినందుకు ఆమెపై గతేడాది ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణ సమయం ఏం జరిగిందో అంతా పూసు గుచ్చి మరీ వివరించింది. గతంలో ఆమెతో కలిసి పని చేసిన తోటి ఉద్యోగులను పోలీసులు విచారించారు.

Also Read: బలూచిస్థాన్ లో బాంబ్ బ్లాస్ట్.. జర్నలిస్ట్ సహా ముగ్గురు మృతి

రోగులు పట్ల దురుసుగా ప్రవర్తించడం, వారిని అవమానించేలా హీథర్ మాట్లాడేదని తేలింది. తన తల్లికి పంపించే మేసెజ్‌లు సైతం తన చుట్టూ ఉన్నవారికి నచ్చేదికాదని చెప్పుకొచ్చారు. పేషెంట్లు తనకు నచ్చలేదని, వారికి హాని కలిగించాలని తరచూ చెబుతుండేదని తేలింది. ఆమెకు ఎలాంటి జబ్బు లేదు. కాకపోతే వ్యక్తిత్వం మంచిది కాదని బయటపడింది. తన తండ్రిని హీథర్ చంపడం స్వయంగా చూశానని బాధిత కుటుంబసభ్యుల్లో ఒకరు న్యాయస్థానికి తెలిపారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News