BigTV English

MI Vs KKR Match Highlights: ముంబై వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ విశేషాలు ఎన్నో.. 12 ఏళ్ల తర్వాత!

MI Vs KKR Match Highlights: ముంబై వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ విశేషాలు ఎన్నో.. 12 ఏళ్ల తర్వాత!

IPL 2024 51st Match MI Vs KKR Highlights: ఐపీఎల్ సీజన్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో తక్కువ స్కోరును కూడా కొట్టలేక చతికిలపడింది. ఒకవేళ గెలిచి ఉంటే, ప్లే ఆఫ్ అవకాశాలు ఉండేవి. ఓడిపోవడంతో ఇప్పుడు పరువు కోసం ఆడాల్సి ఉంటుందని కెప్టెన్ పాండ్యా అన్నాడు. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి.


ముంబై పై నాలుగు వికెట్లు తీసిన కోల్ కతా నాలుగో బౌలర్ గా మిచెల్ స్టార్క్ నిలిచాడు. అంతకుముందు ఆండ్రి రసెల్, సునీల్ సరైన్ (రెండుసార్లు) ఉన్నారు.

ముంబై వర్సెస్ కోల్ కతా తో జరిగిన 33 మ్యాచ్ ల్లో ముంబై ఆలౌట్ కావడం ఇది నాలుగోసారి. ఇకపోతే ఈ సీజన్ లో ముంబై ఎటాకింగ్ లో 5 సార్లు ఓటమిపాలైంది.


Also Read: Virat Kohli’s strike rate Debate: విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై చర్చ.. స్టార్ స్పోర్ట్స్‌పై మాజీ క్రికెటర్ సీరియస్

రెండు ఇన్నింగ్స్ ల్లో ఇరు జట్లు ఆలౌట్ కావడం ఐపీఎల్ లో ఇది నాలుగోసారి. అంతకుముందు ఢిల్లీ-రాజస్థాన్ (2010), కోల్ కతా-బెంగళూరు (2017), ముంబయి- హైదరాబాద్ (2018) లో ఆలౌట్ అయ్యాయి.

వాంఖడే స్టేడియంలో కోల్ కతా విజయం సాధించి 12 ఏళ్లు అవుతోంది. 2024లో ఇదే గెలవడం. ఇంతవరకు కోల్ కతా ఇదే స్టేడియంలో 11 మ్యాచ్ లు ఆడి 9 ఓడిపోయింది.

Also Read: ఐపీఎల్ 2024.. ఈ ఏడాది వివాదాస్పద అంపైరింగ్ సంఘటనలు ఇవే..!

ఒకే వేదికపై 50 ప్లస్ వికెట్లు తీసిన ఐదో బౌలర్ గా బుమ్రా రికార్డ్ సాధించాడు. ఇంతకుముందు ఈడెన్ గార్డెన్స్ లో సరైన్ (69), వాంఖడే స్టేడియంలో లసిత్ మలింగ (68), ఢిల్లీ స్టేడియంలో అమిత్ మిశ్రా (58), బెంగళూరు స్టేడియంలో చాహల్ (52) వికెట్లు పడగొట్టారు. ఇప్పుడు బూమ్రా 51తో వీరి వెనుక ఉన్నాడు.

ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా పీయూశ్ చావ్లా (184) అవతరించాడు. ఇంతకుముంద డ్వేన్ బ్రావ్ (183)ను అధిగమించాడు. ఈ జాబితాలో యజ్వేంద్ర చాహల్ (200) అందరికంటే ముందున్నాడు.

Tags

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×