E-Paper
Advertisement

BRS Party: బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. ఆ ఛానల్ బహిష్కరణ, అసలు కారణం అదే

BRS Party: బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. ఆ ఛానల్ బహిష్కరణ, అసలు కారణం అదే
Advertisement

BRS Party: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ఛానెల్ ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ప్రజా ప్రతినిధిని గౌరవించకుండా, కనీస మర్యాదలు పాటించకుండా చర్చా వేదికలపై అహంకారపూరితంగా వ్యవహరించడం పట్ల పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏబీఎన్ ఛానెల్ నిర్వహించే ఎలాంటి చర్చా కార్యక్రమాల్లోనూ బీఆర్ఎస్ నాయకులు పాల్గొనకూడదని పార్టీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మొదటి నుండి తెలంగాణ ఆకాంక్షలకు, రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థలు విషం చిమ్ముతున్నాయని పార్టీ గుర్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే నాటి ముఖ్యమంత్రిని, ఉద్యమ నాయకత్వాన్ని కించపరుస్తూ అసభ్యకరమైన కథనాలు, ప్రోగ్రామ్‌లు నిర్వహించిన చరిత్ర ఈ సంస్థలకు ఉందని బీఆర్ఎస్ పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఒక ప్రాంత అస్తిత్వాన్ని, నాయకత్వాన్ని అవమానించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పార్టీ స్పష్టం చేసింది.

Advertisement

కేవలం చర్చలకు దూరంగా ఉండటమే కాకుండా, పార్టీకి సంబంధించిన అన్ని అధికారిక కార్యక్రమాల నుండి ఈ సంస్థలను దూరం పెట్టాలని పార్టీ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం ‘తెలంగాణ భవన్’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కార్యాలయాల్లో జరిగే ఎలాంటి పార్టీ సమావేశాలకు, ప్రెస్ మీట్లకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ప్రతినిధులను అనుమతించవద్దని శ్రేణులకు దిశా నిర్దేశం చేసింది. ఇది కేవలం ఒక ప్రతినిధిపై తీసుకున్న చర్య మాత్రమే కాదని, నిరంతరం తెలంగాణ వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్న సంస్థలపై చేసిన పోరాటంగా పార్టీ అభివర్ణించింది.

Also Read: మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Advertisement

జర్నలిజం ముసుగులో రాజకీయ ఎజెండాలను అమలు చేస్తూ, అసభ్యకరమైన భాషను వాడుతున్న తీరుపై బీఆర్ఎస్ నాయకత్వం గుర్రుగా ఉంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండవచ్చు కానీ, అది వ్యక్తిగత దూషణలకు, గౌరవహీనమైన ప్రవర్తనకు దారితీయకూడదని పార్టీ భావిస్తోంది. పార్టీ గౌరవాన్ని, నాయకుల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని, పార్టీ శ్రేణులందరూ దీనిని ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

 

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×