E-Paper
Advertisement

Pahalgam Affect: దాయాదికి భారత్ ఊహించని షాక్.. ఇక ఎయిర్‌లైన్స్‌, నౌకల వంతు?

Pahalgam Affect: దాయాదికి భారత్ ఊహించని షాక్.. ఇక ఎయిర్‌లైన్స్‌, నౌకల వంతు?

Pahalgam Affect: పహల్‌గామ్ ఉగ్రదాడి భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. తప్పు చేసిన దాయాది దేశంపై ఆంక్షలు విధించాల్సిన భారత్, కాస్త సానుకూల వైఖరి అవలంభిస్తోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ విమానాలకు భారత్ గగనతలం, అలాగే ఆదేశ నౌకలకు పోర్టులు మూసి వేయాలనే ఆలోచన చేస్తున్నట్లు హస్తినలో ఓ వార్త హంగామా చేస్తోంది.

పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత ఆంక్షలు విధించిందనే అక్కసుతో భారత్‌పై విషం చిమ్మింది పాకిస్థాన్‌. ఆదేశ గగనతలంపై భారత్ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యలకు మోదీ సర్కార్ సిద్ధమైనట్లు సమాచారం. పాక్‌ విమానయాన సంస్థలకు భారత్ గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి.

విమానాలు, నౌకలపై భారత్ గురి?

ప్రస్తుతానికి విమానాలు, నౌకల విషయమై ప్రతిపాదన పరిశీలన దశలో ఉన్నట్లు సమాచారం. పాకిస్తాన్ కాస్త వెనక్కి తగ్గితే.. సైలెంట్ కావాలని, లేకుంటే చర్యలు చేపట్టాలని భావిస్తోందట మోదీ సర్కార్. వీటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నది కేంద్రానికి చెందిన ఓ అధికారి చెప్పినట్టు సమాచారం. భారత్‌ నిర్ణయం తీసుకుంటే పాక్‌ ఎయిర్‌లైన్లపై తీవ్ర ప్రభావం చూపనుంది.

పాకిస్తాన్ విమానాలు ఆసియాలోని ముఖ్యమైన నగరాలు కౌలాలంపూర్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌‌కు వెళ్లాలంటే భారత్ గగనతలం మీదుగా వెళ్లాల్సిందే. భారత్‌ గనుక నిషేధిస్తే చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలను మళ్లించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంతోపాటు ట్రావెలర్లపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల ఆదేశ విమానాలపై ట్రావెలర్లు ప్రయాణించే ఛాన్స్ ఉండదు. అదే జరిగితే దాయాది దేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం.

ALSO READ: పహల్‌గామ్ ఉగ్రదాడిలో దొరికిపోయిన పాక్ కమాండో

భారత విమానాలకు పాక్‌ తమ గగన తలాన్ని మూసివేసింది. దీంతో భారత ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలు నడుపుతున్నాయి. పాక్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆదేశానికి ఎక్కువ నష్టమన్నది నిపుణులు మాట. భారత్‌ నుంచి పాక్‌ గగనతలం మీదుగా వారానికి 800 లకు పైగా అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. ఇందుకోసం ఓవర్‌ ఫ్లైట్‌ ఫీజు కింద పాక్‌ రోజుకు లక్షా 20 వేలు డాలర్లు వసూలుచేసేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని కోల్పోతుందని అంటున్నారు.

గతంలో ఇబ్బందిపడిన పాక్

2019లో పుల్వామా ఉగ్రదాడి పరిణామాల నేపథ్యంలో 5 నెలలు పాక్‌ తమ గగనతలంలో భారత విమానాలపై ఆంక్షలు విధించింది. అప్పట్లో ఆ దేశం 100 మిలియన్‌ డాలర్ల పైగా నష్ట పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇక నౌకా విభాగానికి వద్దాం. ఇస్లామాబాద్‌లోని భారత్ తన హైకమిషన్ కార్యాలయం నుంచి రక్షణ, నేవీ, వైమానిక విభాగాల సలహాదారులను ఉపసంహరించుకుంది. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపి వేయబడింది. దీనివల్ల అనేక రంగాలపై ప్రభావం చూపనుంది.  పాకిస్తాన్ నౌకలు ఆసియా దేశాలకు వెళ్లాలంటే భారత్ మీదుగా వెళ్తున్నాయి.

నౌకా విభాగంపై భారత్ ఆంక్షలు కొరడా ఝులిపిస్తే ఆదేశ నౌకలకు భారం అమాంతంగా పెరగవచ్చని అంటున్నారు నౌకా విభాగం నిపుణులు. థాయ్‌లాండ్‌కు వెళ్లాలంటే అండమాన్ దీవుల మీదుగా ఆయా నౌకలు వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక మయన్మార్‌‌తో ఆదేశాకున్న వాణిజ్యం నిలిచిపోవడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే పాక్ ఆర్థిక వ్యవస్థ నిలువుగా కుల్పకూలిపోవడం ఖాయమనే వాదనలు లేకపోలేదు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×