Nani: ప్రస్తుతం టాలీవుడ్ లో అందరూ మాట్లాడుకునే సినిమా ఏదైనా ఉందంటే అది హిట్ 3. నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేశాయి. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని ఆడియన్స్ కి చెప్పడంతోపాటు.. సినిమా నచ్చదు అనే మాటే లేదు అని నాని చాలా గట్టిగా చెప్పారు. ఇదే మాట కోర్టు సినిమా టైం లోను చెప్పాను. ఆ సినిమా చాలా సక్సెస్ అయ్యిందని నాని గుర్తు చేయడంతో.. ఇక ఈసినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. హీరో, హీరోయిన్స్ ఇద్దరు ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాని హీరోయిన్ ని భయపెట్టారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
భయపడిన హీరోయిన్ ..
నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం హిట్ 3. హిట్ సీక్వెల్స్ లో ఇది మూడవది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ ఇప్పటికే 30 ఇంటర్వ్యూలకు పైగా ఇచ్చాము అని చెప్పడం విన్నాం. ఇప్పుడు తాజాగా మరో ఇంటర్వ్యూలో హీరో, హీరోయిన్స్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో ఒక సరదా సన్నివేశం జరిగింది. యాంకర్ హీరోని మీరు ట్రైలర్ లో అర్జున్ సర్కార్ గా ఎక్కువగా అరుస్తారు కదా.. అలా అరవడం ఎప్పుడైనా బయట జరిగిందా అని అడుగుతుంది. అప్పుడు నానితో శ్రీనిధి శెట్టి చెవిలో ఏదో చెప్తుంది. యాంకర్ మీరు ఇక్కడ రహస్యాలు మాట్లాడుకోకూడదు అని అంటుంది. ఓకే మీరు ఇంటర్వ్యూ కంటిన్యూ చేయండి అని నాని శ్రీనిధి తో అంటాడు. శ్రీనిధి యాంకర్ తో మీరు కంటిన్యూ చేయండి అని అంటుంది. అప్పుడే నాని ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు విని హీరోయిన్ భయపడుతుంది. యాంకర్ షాక్ అవుతుంది. శ్రీనిధి నేను అరవమని చెప్పింది ఇప్పుడు కాదు, కొంచెం ఇంటర్వ్యూ కంటిన్యూ అయిన తర్వాత అరవమన్నాను. నువ్వు ఇప్పుడే అరిచేసావు అని అంటుంది. యాంకర్ నవ్వుతుంది. నేనే ఐడియా ఇచ్చి నేనే భయపడ్డాను అని శ్రీనిధి అంటుంది. తను భయపడితే చూడాలని ఉంది అని నేను చెప్పాను. నన్నే భయపెట్టేశావు అని శ్రీనిధి నానితో అంటుంది. యాంకర్ ని నానిని భయపెట్టమని శ్రీనిధి చెపితే.. నాని ఇద్దరిని భయపెడతారు. ఇంటర్వ్యూలో జరిగిన ఈ ఫన్నీ సీన్ చూసి అందరూ యాంకర్ ని భయపెట్టమంటే.. హీరోయిన్ ని భయపెట్టావు కదా అన్న అని కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా సక్సెస్ ఫార్ములా ..
హిట్ 3 సినిమా మే 1న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను, నాని, శ్రీనిధి ఇద్దరు రాజమౌళి మా సెంటిమెంట్ ఫార్ముల అని చెప్పడంతో, అభిమానులు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలన్నీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ సినిమా నాని వాల్పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
Nani :17 ఏళ్లు అయింది….ఇప్పటికీ అడుగుతున్నారు అని గుర్తు చేసుకున్న నాని వైఫ్