E-Paper
Advertisement

Indian Origin Murder: కెనడాలో ఘోరం.. భారత సంతతి మహిళా యూట్యూబర్‌ను.. కత్తులతో పొడిచి హత్య

Indian Origin Murder: కెనడాలో ఘోరం.. భారత సంతతి మహిళా యూట్యూబర్‌ను.. కత్తులతో పొడిచి హత్య
Advertisement

Indian Origin Murder: కెనడాలో దారుణం చోటుచేసుకుంది. అంటారియో ప్రావిన్స్‌ (Ontario Province)లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్ (45) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కత్తులతో పొడిచి ఈ దారుణానికి తెగబడినట్లు కెనడా పోలీసులు పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే..

లాసెల్లె పోలీసుల (LaSalle Police Service) కథనం ప్రకారం.. టాడ్ లేన్ లోని 2400 బ్లాక్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 9.30 (కెనడా కాలమానం) ప్రాంతంలో ఈ దాడి జరిగింది. యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్ (Nancy Grewal)పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలింది. దీంతో స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కీలక ఆధారాలు స్వాధీనం

Advertisement

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నాన్సీని హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ.. నాన్సీ ప్రాణాలు కోల్పోయింది. దీంతో బుధవారం ఉదయం దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తునకు అవసరమైన కీలక ఆధారాలను ఘటనాస్థలి నుంచి సేకరించారు. మరోవైపు నాన్సీ మరణంపై లాసాల్లె పోలీస్ సర్వీస్ ఎక్స్ వేదికగా సానుభూతి తెలిపింది. నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చింది.

నాన్సీ గ్రేవాల్ ఎవరంటే?

పంజాబ్ మూలాలు కలిగి ఉన్న నాన్సీ గ్రేవాల్.. కెనడా స్థిరపడింది. సింగర్ గా, యూట్యూబర్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ఆమె కెనడాలో మంచి గుర్తింపు సంపాదించారు. ఆమె నడుపుతున్న ‘Nancy Grewal Canada’ ఛానెల్ కు పెద్ద ఎత్తున సబ్ స్క్రైబర్లు సైతం ఉన్నారు.

Advertisement

Also Read: Tandem OLED vs QD-OLED: కొత్త మానిటర్ కొంటున్నారా? ఈ చిన్న లాజిక్ మిస్సయ్యారో మీ పనైపోయినట్టే!

హత్యకు కారణమదేనా?

అయితే భారత్ కు వ్యతిరేకంగా కెనడాలో విస్తరిస్తున్న ఖలిస్థాన్ వేర్పాటు వాదాన్ని నాన్సీ గ్రేవాల్ సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకిస్తూ వచ్చారు. రాజకీయంగా, సామాజికంగా అనేక అంశాలపై ఆమె తన గళాన్ని వినిపించారు. ఈ క్రమంలోనే గతంలో ఆమెకు పెద్ద ఎత్తున బెదిరింపులు సైతం వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆమె మద్దతుదారుల నుంచి ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Also Read: Vi port Benefits: పాత నెట్‌వర్క్‌తో విసిగిపోయారా? సిమ్ పోర్ట్ పెట్టుకునేవారికి.. వీఐ కళ్లుచెదిరే ఆఫర్లు!

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×