E-Paper
Advertisement

ఇరాన్‌ వార్ సీన్ రివర్స్.. అమెరికా-ఇజ్రాయెల్ సైలెంట్‌, వాటర్ వెపన్‌పై సరికొత్త వాదన

ఇరాన్‌ వార్ సీన్ రివర్స్.. అమెరికా-ఇజ్రాయెల్ సైలెంట్‌, వాటర్ వెపన్‌పై సరికొత్త వాదన
Advertisement

 

IRAN: పశ్చిమాసియాలో పరిస్థితులు మారుతున్నాయా? యుద్ధం వేళ ఇరాన్‌లో వాతావరణం మారిందా? కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయా? వర్షానికి-యుద్ధానికి లింక్ పెట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయా? దశాబ్దంపాటు ఎండిపోయిన సరస్సుల్లో మళ్లీ జీవం కనిపిస్తోందా? వాతావరణం మార్పులపై ఆసక్తికర వాదన వెనుక ఏం జరిగింది?

Advertisement

ఇరాన్‌ వార్ సీన్ రివర్స్.. సైలెంట్‌గా అమెరికా-ఇజ్రాయెల్

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి 50 రోజులు గడిచిపోయింది. ఈ వార్‌లో ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. యుద్దం కోసం ఆయుధ శక్తిని భారీగా ఉపయోగించింది. అసలే కరువుతో అల్లాడుతున్న ఇరాన్‌ను ఈ యుద్ధం కష్టాల ఊబిలోకి నెట్టేసింది. ప్రస్తుతం చర్చల వైపు ఆయా దేశాలు మొగ్గుచూపుతున్నా ఎలాంటి ఫలితం లేదు. అయినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

Advertisement

అమెరికా-ఇజ్రాయెల్‌కు ధీటుగా బదులిస్తోంది. ఉన్నట్లుండి ఇరాన్‌‌లో వాతావరణం మార్పులు అందరిని ఆశ్చర్యంలో పడేసింది. కరువుతో అల్లాడుతున్న ఇరాన్‌లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన మార్పుల వీడియోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అదే సమయంలో కొత్త వాదన తెరపైకి వచ్చింది.

వాటర్ వెపన్‌పై ఇరాన్ సరికొత్త వాదన

వాతావరణాన్నినాశనం చేయడానికి ఉపయోగించే రాడార్లు, ఇజ్రాయెల్‌ యంత్రాలను ఇరాన్‌ ధ్వంసం చేయడంవల్లే ఈ మార్పు సంభవించిందని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దశాబ్దం పైగానే కరువుతో అల్లాడుతోంది ఇరాన్‌. జలాశయాలు ఎండిపోయాయి.. ఇక సరస్సుల గురించి చెప్పాల్సిన పని లేదు. నీటి సంక్షోభం ఓ రేంజ్‌లో ఉంది.

50 రోజుల యుద్ధం తర్వాత అక్కడి వాతావరణంలో మార్పులు కనిపించాయి. మళ్లీ అక్కడ పచ్చదనం మొదలైంది. వంతెనలు నిండిపోయి పూర్తి సామర్ధ్యానికి వస్తున్న తరుణంలో ఇరాన్‌ మీడియా కుట్ర సిద్ధాంతాలను తెరపైకి తెచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్‌‌లకు రాడార్, ఇంజినీరింగ్‌ యంత్రాలను ఇరాన్‌ ధ్వంసం చేయడం ఆకస్మిక మార్పులకు కారణమన్నది ఆ దేశ ప్రజల వెర్షన్.

ALSO READ: చదువులో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడు వైట్‌హౌస్ షూటర్.. ఎవరీ థామస్ అలెన్?

ఈ వార్‌లో అమెరికా-ఇజ్రాయెల్‌‌లకు చెందిన అధునాతన రాడార్‌ వ్యవస్థలపై ఇరాన్ దాడి చేసింది. మధ్యధరా సముద్రంలో తేమను ఇరాన్ నుండి ప్రత్యర్థుల వైపు మళ్లించి మేఘాలను దొంగిలించారనే ఆరోపణలు జోరందుకున్నాయి. ఈ సిద్ధాంతాన్ని సమర్థించేవారు ఇరాన్‌లో లేకపోలేదు.

రాడార్లపై దాడి జరగిన తర్వాత ఇరాన్‌లో కరువు ముగిసిందని అంటున్నారు. ఇరాన్ రాజకీయ చర్చల్లో మేఘాల దొంగతనం అనే భావన కొత్తేమీ కాదు. 2018 నుండి ఈ వాదన పదే పదే తెరపైకి వస్తోంది. విదేశీ శక్తులు ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయెల్-యూఏఈలు పెద్ద ఎత్తున జియో ఇంజనీరింగ్‌ను ఉపయోగించి వాతావరణ సరళిని తారుమారు చేస్తున్నారనేది ఇరాన్ ప్రధాన వాదన.

వర్షపు మేఘాలు ఇరాన్ గగనతలాన్ని చేరకముందే వాటిని డైవర్ట్ చేస్తాయి. దీనివల్ల ఇరాన్‌లో కరువు తీవ్రమైందని అంటున్నారు. మొత్తానికి దేవుడి కరుణా? కరువుకు ముగింపా?

 

 

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×