E-Paper
Advertisement

Drone Hits Kuwait Airport: కువైట్‌ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ల దాడి.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ

Drone Hits Kuwait Airport: కువైట్‌ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ల దాడి.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ
Advertisement

Drone Hits Kuwait Airport: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎదురుదాడి తీవ్రతరం చేసింది. ముఖ్యంగా ఇరాన్ చుట్టూ పొరుగు దేశాలపై దాడులు తీవ్రతరం చేసింది. తాజాగా ఈ నేపథ్యంలో రాత్రి కువైట్ ఎయిర్‌పోర్టుతోపాటు ఇతర లక్ష్యాలపై దాడులు చేసింది ఇరాన్. దీంతో ఒక్కసారిగా కువైట్ షాకైంది.

కువైట్‌ ఎయిర్‌పోర్టుపై మళ్లీ ఇరాన్ డ్రోన్ల దాడి

Advertisement

గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి జరిగింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. అయితే ఇరాన్ డ్రోన్లు ఎయిర్ పోర్టులోని ఇంధనం ట్యాంకులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్టు తెలుస్తోంది. వెంటనే ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

దాదాపు నాలుగైదు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. దాడి నేపథ్యంలో ఆ సమయంలో ఎయిర్ పోర్టులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాడి నేపథ్యంలో కువైట్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాడి వల్ల నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం సుమారు 8 గంటలకు ఈ దాడి జరిగినట్లు గల్ఫ్ మీడియా తెలిపింది.

Advertisement

దాడి నేపథ్యంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

తమ బలగాలు ఆరు డ్రోన్‌లను అడ్డుకున్నాయని కువైట్ నేషనల్ గార్డ్ తెలియజేసింది. కువైట్ ఎయిర్‌పోర్టుపై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పలుమార్లు దాడులకు గురైంది ఎయిర్‌పోర్టు. మార్చి 14న డ్రోన్లు విమానాశ్రయంపై దాడి చేసి రాడార్ వ్యవస్థను ధ్వంసం చేశాయి. మార్చి 8న డ్రోన్లు ఇంధన ట్యాంకులను డ్రోన్‌లు ఢీకొట్టాయి.

అంతకుముందు ప్యాసింజర్ టెర్మినల్‌పై జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు కూడా. బుధవారం ఉదయం సుమారు 8 గంటలకు ఈ దాడి జరిగినట్లు గల్ఫ్ మీడియా వెల్లడించింది. ఇదిలా ఉండగా యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్- అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌కు 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

ALSO READ: ఇరాన్ వినాశనం ఖాయం.. నాయకత్వం కుప్పకూలింది.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

టెహ్రాన్ కూడా వాషింగ్టన్ ముందు పలు డిమాండ్లను ఉంచినట్లు సమాచారం. అక్కడున్న వేలాది మంది సైనికులను వెనక్కి పిలిపించేందుకు అమెరికా సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్ చెబుతున్న నేపథ్యంలో ఇరాన్ దాడులు చేయడం ఏదో జరిగిందనే వాదన లేకపోలేదు.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×