E-Paper
Advertisement

ఇరాన్ కోస్తల్ ఏరియా.. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ప్రాంతం వీడియో ఇదిగో

ఇరాన్ కోస్తల్ ఏరియా.. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ప్రాంతం వీడియో ఇదిగో
Advertisement

Strait of Hormuz:  ఇరాన్ యుద్ధంలో కీలకంగా మారాయి రెండు ప్రాంతాలు. ఒకటి హోర్ముజ్ జలసంధి కాగా, మరొకటి ఖార్గ్‌ ఐలాండ్. ఈ రెండు ప్రాంతాలు ఇరాన్‌ని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. వాటిపై దాడి చేయడమంటే ఆశామాషీ విషయం కాదు. ఈ రెండు ఇరాన్‌కు ఎడమవైపు ఉన్నాయి. శత్రువులు అక్కడ కాలుపెట్టాలంటే పులితో తలపడడమే. హోర్ముజ్ జలసంధి సమీపంలోని భూభాగానికి సంబంధించి వీడియో వెలుగులోకి వచ్చింది.

ఇరాన్ తీరప్రాంతం ఏరియా.. యుద్ధం నుంచి రక్షించేది అదే

Advertisement

ఇరాన్ కోస్తల్‌ ప్రాంతం హోర్ముజ్ జలసంధికి సమీప ప్రాంతానికి చెందిన వీడియో వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ మీడియాకు చెందిన ఓ జర్నలిస్టు ఈ వీడియో బయటపెట్టారు. హోర్ముజ్ జలసంధికి కేవలం 30 నిమిషాల దూరంలో ఉన్న తీరప్రాంతం అది. ఆ వీడియోలో ఎత్తైన కొండలు, ఖనిజాల నేలగా కనిపిస్తోంది.

మైనింగ్ చేసే ప్రాంతం కూడా ఉంది. అక్కడివారికి ఈ ప్రాంతం కొట్టిన పిండి. ప్రత్యర్థులకు మాత్రం నరకమే. ఎటువైపు నుంచి దాడులు చేస్తారేమోనన్న భయం అనుక్షణం వెంటాడుతోంది. ఇవన్నీ తెలిసి అమెరికా దాడులకు వెనక్కి తగ్గుతోందన్న వాదన సైతం లేకపోలేదు. ఇక్కసారి ఇరాన్ భూభాగాల్లోకి వెళ్తొద్దాం.

Advertisement

హోర్ముజ్ జలసంధి సమీపంలోని ప్రాంతం వీడియో ఇదిగో

మధ్యప్రాచ్యంలో కీలకమైన దేశాల్లో ఇరాన్ ఒకటి. అఫ్ఘనిస్తాన్, అర్మేనియా , అజర్‌బైజాన్ , ఇరాక్ , పాకిస్తాన్ , టర్కీ, తుర్క్‌మెనిస్తాన్‌ వంటి దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది. దీనికితోడు ఒమన్ సింధుశాఖ – కాస్పియన్ సముద్రం-పర్షియన్ సముద్రంతో సరిహద్దులు కలిసి ఉంది. ఇరాన్ దేశం దాదాపు 1,648,195 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ప్రపంచంలోని అత్యంత పర్వతాలు ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి.

విస్తారమైన ప్రాంతాన్ని ఆక్రమించింది. ఆ దేశంలో కాకసస్, జాగ్రాస్, ఎల్బుర్జ్ ఎత్తైన పర్వత శ్రేణులకు నిలయం. ఇరాన్ భూభాగం సగానికి పైగానే పర్వత శ్రేణులతో నిండి ఉంటుంది. అందులో ఎల్బుర్జ్-జాగ్రాస్ రెండు అత్యంత కీలకమైనవి. ఈ రెండు ఇరాన్‌కు అపారమైన ప్రయోజనాలను అందిస్తాయి.

ALSO READ: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. క్వెట్టా శివార్లలో గ్యాస్ పైప్‌లైన్‌ పేల్చివేత

1,600 కిలోమీటర్ల విస్తరించిన ఈ ప్రాంతం అత్యంత కఠినమైనది. ప్రతీ 10 నుంచి 15 కిలోమీటర్లు ఎత్తైన పర్వతాలతో నిండి ఉంటుంది. దీనికితోడు ఇరుకైన నౌకా మార్గం. భౌగోళిక స్వరూపమే ఇరాన్‌కు అతిపెద్ద రక్షణ. ఈ ప్రాంతంపై దాడి చేయాలని అమెరికా-ఇజ్రాయెల్ వంటి దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

భూతల దాడుల్లో ఇరాన్‌ను ఓడించడం కష్టమని ఇప్పటికే అమెరికా రక్షణ నిపుణులు హచ్చరించారు. కేవలం వైమానిక, నౌకా మార్గాల్లో మాత్రమే దాడికి ఛాన్స్ ఉంది. నౌకా మార్గంలో దాడి చేస్తే నీటిలో ఉండే మందుపాతరలు పేలితే అపారమైన నష్టం ప్రత్యర్థులకు వాటిళ్లుతుంది. కేవలం వైమానిక దాడులు మాత్రమే.

ఇరాన్‌లో అత్యంత ఎత్తైన ప్రదేశం కుహ్-ఎ దమావంద్. దీని ఎత్తు దాదాపు 18,410 అడుగులు. పర్షియన్ పురాణాల్లో దమావంద్ పర్వతానికి ముఖ్యమైన స్థానం ఉంది. ప్రళయకాలం వచ్చే వరకు మూడు తలల డ్రాగన్‌ను ఈ పర్వతానికి గొలుసులతో బంధించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ పర్వతాన్ని ఇరాన్ 10,000 రియాల్ నోటుపై ముద్రించారు. ఈ పర్వతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×