E-Paper
Advertisement

Pakistan: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. క్వెట్టా శివార్లలో గ్యాస్ పైప్‌లైన్‌ పేల్చివేత, మళ్లీ ఉద్రిక్తంగా ఆ ప్రాంతం

Pakistan: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ..  క్వెట్టా శివార్లలో గ్యాస్ పైప్‌లైన్‌ పేల్చివేత, మళ్లీ ఉద్రిక్తంగా ఆ ప్రాంతం
Advertisement

Pakistan: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హోర్మూజ్ జలసంధిని ఆదేశం మూసివేయడంతో ఆసియా దేశాలు అల్లాడిపోతున్నాయి. చమురు సరఫరా లేకపోవడంతో ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో పాకిస్థాన్‌కు గ్యాస్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. క్వెట్టా సమీపంలో గ్యాస్ పైప్‌లైన్‌ని పేల్చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. క్వెట్టా శివార్లలో గ్యాస్ పైప్‌లైన్‌ పేల్చివేత

Advertisement

ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు గ్యాస్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా సమీపంలో గ్యాస్ పైప్‌లైన్‌ని గుర్తు తెలియని వ్యక్తులు పేల్చివేశారు. ఫలితంగా ఆయా ప్రాంతంలో గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు పాక్ అధికారులు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

ఇప్పటివరకు ఈ దాడికి సంబంధించి ఎవరూ బాధ్యత వహించలేదు. కొన్నాళ్లుగా ఇస్లామాబాద్ పాలకులపై అశాంతితో ఉన్నారు బలూచిస్తాన్ ప్రాంతం. రాజధాని క్వెట్టా నగర శివారులో 18 అంగుళాల వ్యాసం గల ప్రధాన గ్యాస్ సరఫరా పైప్‌లైన్‌ని పేల్చివేశారు. ఈ విషయాన్ని సుయ్ సదరన్ గ్యాస్ కంపెనీ ప్రతినిధి తెలిపారు.

Advertisement

 మళ్లీ ఉద్రిక్తంగా ఆ ప్రాంతం.. విధ్వంస చర్య కావచ్చని అధికారుల ఆలోచన

దీని కారణంగా నగరంలోని పలు ప్రాంతాలతోపాటు ఐదు జిల్లాలకు గ్యాస్ సరఫరాను నిలిచిపోయింది. చాన్నాళ్లుగా ఆ ప్రాంతంలో వేర్పాటువాద తిరుగుబాటుదారులు, మిలిటెంట్లు కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు వేర్పాటువాదులు. ఈ ప్రాంతంలోని ఖనిజ సంపద తమకు దక్కాల్సిన వాటాను స్థానికులకు దక్కకుండా చేస్తున్నారని ఇస్లామాబాద్‌ పాలకులపై మండిపడుతున్నారు.

మంటలు భారీగా ఎగిసిపడగానే సంబంధిత బృందాలు గ్యాస్ సరఫరా చేసే ప్రధాన వాల్వ్‌ను మూసి వేశారు. మరింత నష్టం జరగకుండా అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. విధ్వంస చర్య కావచ్చని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ పేలుడుకు ఇప్పటివరకు ఏ ఒక్కరూ బాధ్యత వహించలేదు.ఈ ప్రాంతంలో గ్యాస్ పైప్‌లైన్‌లు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాలపై చాన్నాళ్లుగా దాడులు జరుగుతున్నాయి.

ALSO READ: యుద్ధం ముదిరింది.. భారత్‌కు వెళ్లాల్సిన విమానంపై అమెరికా దాడి.. యుద్ధం చర్యేనన్నఇరాన్ 

 

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×