E-Paper
Advertisement

హర్మూజ్‌లో 20 శాతం టోల్‌ ఇష్యూ.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్, మార్కెట్లో ఆయిల్ ధరల మంటలు

హర్మూజ్‌లో 20 శాతం టోల్‌ ఇష్యూ.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్, మార్కెట్లో ఆయిల్ ధరల మంటలు
Advertisement

Strait of Hormuz Tax: ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధం తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులు దాడులకే పరిమితమైన ఇరు దేశాలు, మాటల యుద్ధానికి దిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ప్రపంచ దేశాల్లో గుబులు మొదలయ్యాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కూడా ఆదే స్థాయిలో కౌంటరిచ్చింది.

హర్మూజ్‌ చుట్టూ ప్రపంచ రాజకీయాలు-అమెరికా అధ్యక్షుడు ట్రంప్  రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఒక రోజు సీజ్ ఫైర్ ఎండ్ అంటారు.. హోర్మూజ్‌జలసంధిపై టాక్స్ వసూలు చేస్తామని అంటున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కాలేదు. ఆయన ప్రకటన పరిణామాలు మార్కెట్లపై పడుతున్నాయి. ఫలితంగా ఆయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.

Advertisement

హర్మూజ్‌లో 20 శాతం టోల్‌ ఇష్యూ-తాజాగా పశ్చిమాసియాలో యుద్ధం మేఘాలు క్రమంగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కత్తులు దూసుకుంటున్నాయి.హోర్మూజ్ జలసంధిని మూసి వేస్తామని  ఇరాన్‌ ప్రకటన చేసిన కొద్దిగంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రియాక్ట్ అయ్యారు.

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్- హర్మూజ్‌లో ప్రయాణించే నౌకల సరకు విలువలో 20 శాతం టోల్‌ వసూలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌ను అమెరికా నేవీ బలగాలు మళ్లీ దిగ్బంధిస్తున్నామని చెప్పారు. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా అడ్డుకుంటామన్నారు. ఇరాన్ నుంచి బయలుదేరే నౌకలను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. ఇతర నౌకలు జలసంధిని స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని తేల్చిచెప్పారు.

Advertisement

మార్కెట్లో ఆయిల్ మంటలు-హర్మూజ్‌లో నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకల సరకు విలువలో 20 శాతం టోల్‌ వసూలు చేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనపై ఇరాన్‌ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది.  హర్మూజ్ జలసంధి  విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని తేల్చి చెప్పేసింది.

వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే బలప్రయోగానికి దిగుతామని ఇరాన్ మిలిటరీ కమాండ్‌ హెచ్చరించింది. హర్మూజ్ ఇప్పటికీ  తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. ట్రంప్‌ టోల్‌ ప్రకటనపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

హర్మూజ్‌లో రక్షణ కల్పించేవారు ఛార్జీలు వసూలు చేయడం మంచిదేనని, అక్కడ రక్షకులు తామేనని అన్నారు. అందువల్ల టోల్‌ తాము వసూలు చేస్తామన్నారు. 20 శాతం టోల్‌ చాలా ఎక్కువని, తాము తక్కువ తీసుకుంటామని ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు.

ALSO READ: హెలికాప్టర్ గన్‌తో పిచ్చి ప్రయోగాలు.. ఒక్కసారిగా తిరగబడ్డ మెషీన్‌గన్, వీడియో వైరల్

ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురు దాదాపు 20 శాతం హోర్ముజ్‌ జలసంధి గుండా రవాణా అవుతుంది. ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన మార్కెట్లపై ధరల ప్రభావం చూపింది.  కేవలం ఒక్కరోజులో బ్రెంట్ క్రూడ్ ధర 9 శాతం పెరిగింది.  దీనిపై భారత్‌పై పడే అవకాశముంది. ట్రంప్‌ ప్రతిపాదించిన 20 శాతం టోల్‌ అమల్లోకి వస్తే ఒక ఆయిల్  ట్యాంకర్‌ దాదాపు 30 మిలియన్‌ డాలర్ల అదనపు రుసుము చెల్లించాల్సి వస్తుంది.

దీనివల్ల ఆసియా దేశాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. గడిచిన రెండు నెలల యుద్ధంలో ద్రవ్యోల్భణం తారాస్థాయికి చేరింది. దాని నుంచి కోలుకోవడానికి మరో ఆరు నెలలు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంధన వ్యయం భారీగా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణంపై పెను ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related News

నేపాల్‌లో రగులుతున్న మరో జెన్-జీ ఉద్యమం.. ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్.. ఎందుకంటే?

యుద్ధ చరిత్రలోనే తొలిసారి.. ఇరాన్ నావికా స్థావరంపై అమెరికా సీ డ్రోన్ల ఊహించని మెరుపు దాడి

హెలికాప్టర్ గన్‌తో పిచ్చి ప్రయోగాలు.. ఒక్కసారిగా తిరగబడ్డ మెషీన్‌గన్, వీడియో వైరల్

Tehran: ఖమేనీ అంత్యక్రియల్లో ముసుగు వీరుడు.. ఆ వ్యక్తి గుట్టు వీడింది, అతడు ఎవరో తెలుసా?

బ్యాంకాక్‌లో భారీ అగ్నిప్రమాదం.. 27 మంది బలి.. నిర్లక్ష్యమే కారణమా?

చేతులతోనే ఆలోచిస్తుంది.. రూపం మార్చి శత్రువులనే వణికిస్తుంది.. అసలు దీనికి అంత తెలివి ఎలా వచ్చింది?

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన యువతి!

Big Stories

Advertisement
×