E-Paper
Advertisement

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. కేంద్రం వేగంగా అనుమతులు, ఇప్పుడు ఇమిగ్రేషన్‌ వంతు

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. కేంద్రం వేగంగా అనుమతులు, ఇప్పుడు ఇమిగ్రేషన్‌ వంతు
Advertisement

Bhogapuram Airport: ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టు పనులే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు వేగంగా వస్తున్నాయి. తాజాగా అథరైజ్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ చెక్‌ పోస్ట్‌‌గా కేంద్రం నోటిఫై చేసింది. ఈ క్రమంలో భోగాపురం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.

భోగాపురం ఎయిర్‌పోర్టు మరోె ఘనత-భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముందు కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల అనుమతులు దాదాపుగా వచ్చేశాయి. తాజాగా మైలురాయిని సాధించింది. భోగాపురం ఎయిర్‌పోర్టును అథరైజ్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ చెక్‌ పోస్ట్‌గా  కేంద్రప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ లెక్కన అక్కడి నుంచి  అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు అంతా రెడీ అయ్యింది.

Advertisement

భోగాపురం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు-ఇమ్మిగ్రేషన్-విదేశీయుల చట్టం 2025లోకి చేరుస్తూ  కేంద్ర హోంశాఖ  ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ అదనపు కార్యదర్శి ఉత్తర్వులు చేశారు. కేటగిరీ -1 కింద ఎయిర్ పోర్టుల జాబితాలో 39వ స్థానం దక్కింది. ఈ మేరకు కేంద్రం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్జాతీయ విమాన సేవలను నిర్వహించాలంటే ఎయిర్‌పోర్టుకు ఇమ్మిగ్రేషన్‌ చెక్‌ పాయింట్‌ హోదా కీలకం.

అథరైజ్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ చెక్‌ పోస్ట్‌‌గా కేంద్రం గుర్తింపు-ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఆ హోదా దక్కడంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలు మొదలుకానున్నాయి. దీంతో పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌, వీసా తనిఖీలు, ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియలను నిర్వహించేందుకు అధికారిక అనుమతులు లభించాయి. ఇప్పటికే ఎయిర్‌‌పోర్టు నిర్మాణం పూర్తయ్యింది. వీలు కుదిరితే ఆగష్టు చివర లేకుంటే సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభానికి రెడీ అయ్యింది.

Advertisement

ఆగష్టు లేకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ప్రారంభం-వారం కిందట ఏరో డ్రోమ్ లైసెన్స్‌ను జీఎంఆర్‌ ప్రతినిధులకు అందుకున్నారు. షెడ్యూల్ ప్రకారం జూలై‌లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభించాలని భావించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి మోదీ షెడ్యూల్ కుదరకపోవటంతో డిలే అవుతూ వస్తోంది. విమానాశ్రయం ప్రారంభమైన వారం రోజుల తర్వాత పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలుకానున్నాయి.

ఇక ఎయిర్‌పోర్టు ఇంటిరియర్-ఎక్స్‌టీరియర్‌ వసతుల గురించి చెప్పనక్కర్లేదు.  స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. అలాగే విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా రహదారులు నిర్మిస్తున్నారు. రానున్న పాతికేళ్ల అవసరాలను దృష్టిలో భోగాపురం విమానాశ్రయం నిర్మాణం చేపట్టారు.

ALSO READ: భుజాలు నొప్పి అంటా.. ఎందుకో మాకు తెలీదు.. పవన్ సర్జరీపై అంబటి రాంబాబు సెటేర్లు!

ఈ విషయాన్ని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా తెలిపారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఏటా సుమారు 4 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించేందుకు రూపొందించబడింది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఎగిరే చేప ఆకారంలో నిర్మించిన 78 వేల చదరపు మీటర్ల టెర్మినల్ భవనం ఉంది.

 

Related News

పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రజల కష్టాలు పట్టవా? సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్!

గుంటూరు ల్యాండ్ వివాదం.. చంద్రబాబుకు జోగి రమేష్ ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే ఎంక్వైరీ వేసుకోండి!

రాయలసీమ అభివృద్ధిపై.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్!

విజయసాయిరెడ్డి ఎక్కువగా ఊహించుకోవద్దు.. పబ్లిసిటీ కోసమే-సజ్జల కౌంటర్ ఎటాక్

షాకైన వైసీపీ పెద్దలు.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు, అసలు ఏం జరిగింది?

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్ మాటేంటి?

జై కొడుతూనే జేబులు కొట్టేశారు.. మంత్రుల పర్యటనలో జేబు దొంగల హల్‌చల్

తాకట్టు ఉంగరం గొడవ ప్రాణాలు తీసిందా? వేల్పూరు దంపతుల ఆత్మహత్య వెనుక అసలు కథ!

Big Stories

Advertisement
×