Acid Bottle: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దాహమేసి మంచి నీళ్లు అనుకుని ఓ యువతి యాసిడ్ తాగింది. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
జ్యూవెలరీ షాప్‌లో దారుణం..
హాపూర్‌లోని అర్జున్ నగర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. ఒక యువతి కొన్ని ఆభరణాలు కొనుగోలు చేయడానికి స్థానిక జ్యువెలరీ షాప్‌నకు వెళ్లింది. నగలు చూస్తున్న సమయంలో ఆమెకు తీవ్రంగా దాహం వేసింది. దీంతో తాగడానికి కొన్ని నీళ్లు ఇవ్వాలని అక్కడి దుకాణదారుడిని కోరింది.
సీల్డ్ బాటిల్‌లో యాసిడ్
ఆభరణాల వ్యాపారి వెంటనే స్పందించి.. పక్కనే ఉన్న ఒక మిఠాయి దుకాణం (స్వీట్ షాప్) నుంచి నీళ్లు తీసుకురావాలని ఓ చిన్న బాలుడిని పంపించాడు. ఆ బాలుడు తెచ్చిన, పూర్తిగా సీల్ చేసి ఉన్న ఒక వాటర్ బాటిల్‌ను ఓపెన్ చేసి యువతికి ఇచ్చారు. దాన్ని మంచి నీళ్లే అనుకుని ఆమె నోట్లో పోసుకుని తాగింది. అంతే.. మరుక్షణమే నోరంతా తీవ్రంగా మండిపోవడంతో గట్టిగా అరుస్తూ బయటకు పరుగెత్తి, ఆ ద్రావణాన్ని ఉమ్మేసింది.
కొనసాగుతున్న విచారణ
బాటిల్‌లో ఉన్నది నీళ్లు కాదని, ప్రమాదకరమైన యాసిడ్ అని గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారింది.
కేసు నమోదు..
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మిఠాయి దుకాణం యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తమ దుకాణానికి సరఫరా అయిన బాటిళ్లలోనే ఆ యాసిడ్ ఉందని, అందులో యాసిడ్ ఉన్న విషయం తనకు అస్సలు తెలియదని అతడు పోలీసులకు తెలిపాడు. దీంతో షాప్‌లోని మిగిలిన బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.
Horrifying incident in Meerut.
Teacher Riya, thirsty while buying jewellery, drank from a sealed Bisleri bottle, it contained acid instead of water. She is now battling for life in hospital.
Shopkeeper claims bottle came sealed from company. Police have detained him.#Meerut… pic.twitter.com/bg40PrnVkG
— GarudEyeIntel | OSINT 🇮🇳 (@GarudEyeIntel) July 11, 2026