E-Paper
Advertisement

Tehran: ఖమేనీ అంత్యక్రియల్లో ముసుగు వీరుడు.. ఆ వ్యక్తి గుట్టు వీడింది, అతడు ఎవరో తెలుసా?

Tehran: ఖమేనీ అంత్యక్రియల్లో ముసుగు వీరుడు.. ఆ వ్యక్తి గుట్టు వీడింది, అతడు ఎవరో తెలుసా?
Advertisement

Tehran: ఇరాన్ దివంగత సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల గురించి ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియల సమయంలో ఓ వ్యక్తి  ముసుగు ధరించి కనిపించాడు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసింది. చివరకు ఆ వ్యక్తి ఎవరన్నది తేలిపోయింది.

ఎట్టకేలకు ముసుగు వీరుడు గుట్టు విప్పిన ఇరాన్ మీడియా-ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపుదాడిలో ఇరాన్ సుప్రీం అయుతుల్లా అలీ ఖమేనీ మరణించాడు. ఆయనతోపాటు చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఈ దాడిలో ఖమేనీ కుటుంబసభ్యులు మృత్యువాత పడ్డారు. యుద్ధం నేపథ్యంలో అలీ ఖమేనీ అంత్యక్రియలను డిలే చేస్తూ వచ్చారు ఇరాన్ పాలకులు.

Advertisement

ఖమేనీ అంత్యక్రియల్లో ముసుగు వీరుడు-అయితే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.  దీంతో అంత్యక్రియల వ్యవహారాన్ని పూర్తి చేశారు. ఖమేనీ మరణించిన నాలుగు నెలల తర్వాత ఆయన స్వస్థలమైన మషద్‌లోని ఇమామ్ రెజా పుణ్యక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించింది ప్రభుత్వం. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ఖమేని మృతదేహాన్ని పాడవ్వకుండా కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచింది.

ఖమేనీ మనవడు ముస్తఫా కుమారుడు మహ్మద్ జావాద్‌-ఖమేనీ కుటుంబ సభ్యుల గాయాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ఇరాన్ ప్రభుత్వం. ఖమేనీ వారసుడిగా చెబుతున్న కొడుకు మొజ్తబా ఖమేనీ ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ముఖం, కాళ్లు, చేతికి తీవ్రగాయాలు అయినట్టు అమెరికా-ఇజ్రాయెల్ నిఘా వర్గాలు తెలిపాయి.

Advertisement

యుద్ధం మొదలై నుంచి మొజ్తబా బయట కనిపించలేదు. సైనిక-మత పెద్దలతో లిఖితపూర్వక సందేశాల ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చివరకు తండ్రి ఖమేనీ అంత్యక్రియలకు మొజ్తబా దూరంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఖమేనీ పెద్ద కొడుకు ముస్తఫా కుమారుడు మహ్మద్ జావాద్‌కు వైమానిక దాడుల్లో ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.

ALSO READ: బ్యాంకాక్‌లో భారీ అగ్నిప్రమాదం.. 27 మంది బలి.. నిర్లక్ష్యమే కారణమా?

తాత ఖమేనీ అంత్యక్రియల్లో అతడు పాల్గొన్నాడు. మాస్క్, టోపీ ధరించడంతో ఎవరా వ్యక్తి అంటూ అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సైతం ఆరా తీశాయి. దీనిపై చివరకు  ఇరాన్ మీడియా అసలు గుట్టు విప్పింది. దీంతో ఖమేని అంత్యక్రియుల్లో మొజ్తబా హాజరుకాలేదని తేల్చేసింది.

ఖమేనీ పెద్ద మనవడు మహ్మద్ జావాద్ ఖమేనీ అని ఇరాన్ మీడియా తేల్చిచెప్పింది. దీంతో నిఘా వర్గాలు కాస్త ఊపిరిపీల్చుకున్నట్లు సమాచారం. అంత్యక్రియుల్లో  సుమారు 43 మిలియన్ల మంది పాల్గొన్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలియజేసింది.

Related News

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

భూమికి సౌర తుఫాను ముప్పు.. ఉపగ్రహాలు- జీపీఎస్ వ్యవస్థల మాటేంటి? రాత్రికి ఆకాశంలో ఏం జరుగుతోంది?

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా

అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!

కుప్పకూలిన నెట్‌వర్క్‌లు, మూతపడ్డ ఎయిర్‌పోర్ట్.. పనామాలో మహా విపత్తు!

Big Stories

Advertisement
×