E-Paper
Advertisement

US Refinery Explosion: అమెరికా చమురు రిఫైనరీలో భారీ పేలుడు.. ఎగిసిపడిన మంటలు, ఎవరి పని?

US Refinery Explosion: అమెరికా చమురు రిఫైనరీలో భారీ పేలుడు.. ఎగిసిపడిన మంటలు, ఎవరి పని?
Advertisement

US Refinery Explosion: అమెరికాలోని టెక్సాస్ చమురు రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దించారు. అసలేం జరిగింది?

అమెరికా చమురు రిఫైనరీలో భారీ పేలుడు

Advertisement

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈలోగా చమురు రిఫైనరీలో పేలుడు ఒక్కసారిగా అమెరికాకు కునుకుపట్టడం లేదు. టెక్సాస్‌లోని పోర్ట్ ఆర్థర్ ప్రాంతంలో ఉన్న రిఫైనరీలో పేలుడు సంభవించింది. హీటర్‌ పేలడం వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు.

సోమవారం సాయంత్రం దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్టు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు కంపించాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్థానిక మీడియా చెబుతోంది.

Advertisement

సహాయక చర్యలు ముమ్మరం.. అమెరికాలో అతి పెద్ద రిఫైనరీ‌

ఇదిలాఉండగా ప్లాంట్ లోకి విషపూరిత పదార్థాలు విడుదలయ్యాయో లేదో నిర్ధారించడానికి అధికారులు గాలి నాణ్యతను పరిశీలిస్తున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సమీపంలోని ప్రజలంతా ఇళ్లలో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని అతిపెద్ద రిఫైనరీలలో ఇది కూడా ఒకటి.

టెక్సాస్ గల్ఫ్ కోస్ట్‌లో వాలెరో పోర్ట్ ఆర్థర్ రిఫైనరీ.. హెవీ సోర్ క్రూడ్ ఆయిల్ నుండి రోజుకు 435,000 బ్యారెళ్ల గ్యాసోలిన్, డీజిల్, జెట్ ఫ్యూయల్ చమురును శుద్ధి చేస్తుంది. అంతటి కీలకమైన రిఫైనరీ కేంద్రంలో కార్యకలాపాలు నిలిచిపోతే ఇంధన సరఫరాపై తీవ్ర పరిణామాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: ఘోర విమాన ప్రమాదం.. ఎయిర్ ఫోర్స్ విమానం కుప్పకూలి 100 మంది మృతి?

 

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×