Rinku Singh Job: టీమిండియా టీ20 ఫినిషర్ రింకూ సింగ్ కు ( Rinku Singh) బంపర్ ఆఫర్ తగిలింది. ఇప్పటికే టీమిండియాలో ఛాన్సులు కొట్టేస్తూ దూసుకు వెళ్తున్న రింకూ సింగ్ కు ఉత్తరప్రదేశ్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. టీమిండియాకు సేవలు అందిస్తున్న రింకూ సింగ్ కు ప్రభుత్వ ఉద్యోగం ( Rinku Singh Govt Job) ఇచ్చేందుకు యూపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ ఆటగాడు రింకూ సింగ్ ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ గా ( regional sports officer ) నియామకం చేసేందుకు యోగి సర్కార్ ( UP government) సిద్ధమైనట్లు కలుస్తోంది. భారత క్రికెట్ జట్టుకు రింకూ సింగ్ సేవలు చేస్తున్న నేపథ్యంలో ఆయన నిబద్ధతకు గుర్తింపుగా ఈ అవకాశం దక్కనున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఉద్యోగంతో నెలకు రూ. 1, 77,500 వరకు రింకూ సింగ్ కు జీతం రానుంది. ఇదంతా ఆయనకు కాబోయే భార్య పార్లమెంట్ సభ్యులు ప్రియా సరోజ్ (MP Priya Saroj) చేసిన లాబీయింగ్ అని తెలుస్తోంది.
టీమిండియా డేంజర్ ఆటగాడు రింకూ సింగ్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది ఉత్తర ప్రదేశ్ లోని యోగి సర్కార్. టీమిండియా జట్టుకు అతను అందిస్తున్న సేవలకు గాను ఈ ఉద్యోగం ఇస్తూ నిర్ణయం తీసుకుందట యోగి సర్కార్. అయితే రింకూ సింగ్ కు కాబోయే భార్య ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెనే ప్రియా సరోజ్. అయితే తన కాబోయే భర్తకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని ప్రియా సరోజ్ విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యోగి ప్రభుత్వాన్ని పదే పదే రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే ఆమె రిక్వెస్ట్ నేపథ్యంలో రింకూ సింగ్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు దిగివచ్చిందట సర్కార్. ఇందులో భాగంగానే యూపీలో రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ గా అతనికి పోస్ట్ ఇవ్వనున్నారు. ఈ ఉద్యోగం ఉత్తరప్రదేశ్ లో గ్రూప్-A కిందికి వస్తుంది. ఈ ఉద్యోగం ద్వారా జీతం, అలవెన్సుతో కలిపి రూ.56000 నుంచి రూ. 1, 77,500 వరకు రింకూ సింగ్ కు రానుంది.
రింకూ సింగ్ – ప్రియా సరోజ్ పెళ్లి జూన్ లో జరిగే ఛాన్సు ఉంది. ఇటీవల రింకూ సింగ్ తండ్రి మరణించాడు. దీంతో పెళ్లి కాస్త వాయిదా పడింది. అందుకే ఐపీఎల్ అయిపోయిన తర్వాత రింకూ సింగ్ – ప్రియా సరోజ్ పెళ్లి జరుగనుంది. కాగా 2025, జూన్ మాసంలో లక్నో వేదికగా రింకూ సింగ్ – ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్ జరిగింది.