E-Paper
Advertisement

ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ మృతి? వారసత్వం తుడిచిపెట్టుకుపోయిందా?

ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ మృతి? వారసత్వం తుడిచిపెట్టుకుపోయిందా?
Advertisement

Mojtaba Khamenei Death Rumors: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తాబా ఖమేనీ మృతి చెందినట్లు స‌మాచారం. ఫిబ్రవరి 28న అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఆయన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించగా, అదే దాడిలో ముస్తాబా తీవ్రంగా గాయపడ్డారనే వార్తలు వచ్చాయి. అప్పటి నుండి నేటి వరకు ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం, కనీసం ఒక్క వీడియో లేదా ఆడియో సందేశం కూడా విడుదల కాకపోవడం ఆయన మృతిపై వస్తున్న ఊహగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అమెరికాకు చెందిన పలు సోషల్ మీడియా హ్యాండిల్స్.. ఇజ్రాయెల్ వర్గాలు ముస్తాబా ఇప్పటికే మరణించారని, ఇరాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతోందని ప్రచారం చేస్తున్నాయి.

మార్చి 8న ముస్తాబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు ప్రకటించినప్పటికీ, గత నెల రోజులుగా ఆయన ఉనికిపై స్పష్టత లేదు. ఇరాన్ అధికారిక మీడియా కేవలం ఆయన పేరుతో రాతపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తోంది. పాత ఫుటేజ్ లేదా AIతో సృష్టించిన ఫోటోలపైనే ఇరాన్ ఆధారపడుతుండటం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇటీవల నౌరూజ్ (ఇరాన్ కొత్త సంవత్సరం), ఈదుల్ ఫితర్ ప్రార్థనల వంటి కీలక సందర్భాల్లో కూడా ఆయన కనిపించకపోవడం, ఆయన స్థానంలో ఇతర మతగురువులు ప్రసంగించడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ సైతం ముస్తాబా బతికి ఉండే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేయడం ఈ మిస్టరీని మరింత పెంచింది.

Advertisement

గార్డియన్ పత్రిక నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 28 దాడిలో ముస్తాబా కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని.. వికృతంగా మారిన తన రూపాన్ని ప్రజలకు చూపించడానికి ఇష్టపడక అజ్ఞాతంలో ఉన్నారని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడికి, శక్తివంతమైన ఐఆర్‌జీసీ (IRGC) దళాలకు మధ్య అంతర్గత పోరు నడుస్తోందని, అసలైన అధికారం ఇప్పుడు మిలిటరీ చేతుల్లోనే ఉందనే వార్తలు వస్తున్నాయి.

ఇటీవల ఇస్లామిక్ రిపబ్లిక్ డే సందర్భంగా ముస్తాబా పేరుతో ఒక ప్రకటన వెలువడింది. యుద్ధం వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి ప్రజలందరూ కలిసి రావాలని ఆ సందేశం కోరింది. ఇది అమెరికా, ఇజ్రాయెల్‌లకు షాక్ ఇచ్చే విషయంగా తొలుత భావించినప్పటికీ, అది కేవలం ఒక రాతపూర్వక ప్రకటన కావడంతో సందేహాలు తొలగలేదు. బహిరంగంగా రావడం వల్ల మొసాద్ లేదా సిఐఏ ఏజెంట్ల చేతిలో ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉందని భావించి ఆయన దాక్కున్నారా? లేక నిజంగానే మరణించారా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

Advertisement

Read Also: అమెరికాకు వరుస షాకులు.. రెస్క్యూ విమానం కూల్చివేత.. సొంత విమానాలనే పేల్చివేసిన అమెరికా సైన్యం..

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×