E-Paper
Advertisement

Newzeland : ఆ దేశంలో 16 ఏళ్లకే ఓటు హక్కు..ఎక్కడంటే ?

Newzeland : ఆ దేశంలో 16 ఏళ్లకే ఓటు హక్కు..ఎక్కడంటే ?
Advertisement

Newzeland : న్యూజిలాండ్ ఆ దేశ పౌరులకు ఓటు హక్కు వయస్సును తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. 16 ఏళ్లకే ఓటు హక్కు కల్పించాలని భావిస్తోంది. ఓటు హక్కు అర్హతను 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనను పార్లమెంట్‌లో ప్రవేశ పెడతామని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ ప్రకటించారు. న్యూజిలాండ్ సుప్రీంకోర్టు 16 ఏళ్ల వారికి ఓటు హక్కు కల్పించడంపై సానుకూలంగా స్పందించింది. దీంతో న్యూజిలాండ్ ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఓటుహక్కు బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి చర్చిస్తామని జెసిండా తెలిపారు.

న్యూజిలాండ్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌లోని 75% మంది సభ్యులు ఓటు హక్కు వయస్సును తగ్గించే బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే ఓటు హక్కు వయస్సు తగ్గించే ప్రతిపాదనను రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాలు మద్దతు ఇస్తే న్యూజిలాండ్ లో 16 ఏళ్లకే ఓటు హక్కు వస్తుంది. ఇప్పటికే ఆస్ట్రియా, మాల్టా, బ్రెజిల్, క్యూబా, ఈక్వెడార్‌ దేశాలు 16 ఏళ్లకే ఓటు హక్కు కల్పించాయి. ఈ జాబితాలో న్యూజిలాండ్ చేరేందుకు ప్రయత్నిస్తోంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×