BigTV English

Earthquake : ఇండోనేసియాలో భూకంప విషాదం..జావా ద్వీపం అతలాకుతలం

Earthquake : ఇండోనేసియాలో భూకంప విషాదం..జావా ద్వీపం అతలాకుతలం

Earthquake : ఇండోనేసియాలో సంభవించిన భూకంపంలో 162 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా అనేక మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. భూకంపం వల్ల 13 వేల మంది నిరాశ్రయులయ్యారు.


ఇండోనేసియాలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రధాన ద్వీపం జావాను సోమవారం భారీ భూకంపం అతలాకుతలం చేసింది. భూకంప కేంద్రం చియాంజుర్‌ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ ప్రాంతంలో ఇళ్లన్నీ కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇండోనేసియాలో చాలా మంది విద్యార్థులు సాధారణ తరగతులు ముగిసిన తర్వాత ఇస్లామిక్‌ పాఠశాలల్లో అదనపు తరగతులకు హాజరవుతారు. మృతిచెందిన వారిలో ఆ విద్యార్థులే అధికంగా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 700 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. చాలా మందికి ఆరుబయటే చికిత్స అందిస్తున్నారు. చియాంజుర్‌ పరిసరాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం పెరిగింది.


జెడిల్‌ గ్రామంలో 25 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని రక్షించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.6గా నమోదైంది. దీని ప్రభావం చియాంజుర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని జకార్తాలోనూ కనిపించింది. అక్కడ అపార్టుమెంట్లు, కార్యాలయాలు కంపించాయి. ప్రజలు, ఉద్యోగులు ప్రాణభయంతో వీధుల్లో పరుగులు తీశారు.

ఇండోనేసియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. అయితే జకార్తాలో ప్రకంపనల ప్రభావం అంతగా కనిపించదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ సమత్రా ప్రావిన్సులో 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది జనవరిలో సులావేసిలో భూకంపం వల్ల 100 మంది మృత్యువాత పడ్డారు.

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×