BigTV English
Advertisement

P.M. Modi popularity: ప్రభుత్వం సంకీర్ణమే అయినా..ప్రజాదరణ సంపూర్ణం..మోదీ హవా

P.M. Modi popularity: ప్రభుత్వం సంకీర్ణమే అయినా..ప్రజాదరణ సంపూర్ణం..మోదీ హవా

PM Modi Once Again Tops List Of Most Popular Global Leader With 69% Rating: Survey: రెండు సార్లు అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న బలంతో ప్రధానిగా కొనసాగారు మోదీ. మూడో సారి మాత్రం మితిమీరిన ఆత్మవిశ్వాసంతో నాలుగువందల సీట్లు వస్తాయని ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించి చివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేక మిత్ర పక్షాల సహకారంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మోదీ. రామ మందిరం కట్టించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాంగ్రెస్ కూటమి మెజారిటీ స్థానాలతో దూసుకుపోయింది. మోదీ పోటీ చేసిన వారణాసి లోనూ గతంలో కన్నా మెజారిటీ తగ్గింది. అయినా ప్రపంచ వ్యాప్తంగా మాత్రం జనాదరణలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు మోదీ.


69 శాతం జనామోదం

అంతర్జాతీయ మార్నింగ్ కన్సల్ట్ సంస్థ రీసెంట్ గా ప్రపంచ ప్రజాదరణ నేతల ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. దీని ప్రకారం మోదీ 69 శాతం జనామోదం కలిగిన నేతగా ప్రథమ స్థానాన్ని పొందారు. రెండో స్థానంలో మెక్సికన్ అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రడార్ ఉన్నారు. 63 శాతం జనాదరణతో మోదీ కన్నా ఆరు శాతం తక్కువగా ఉన్నారు.మూడో ప్లేస్ లో అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ అరవై శాతం జనాదరణ కలిగి ఉన్నరు. గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ జరిపిన ఈ సర్వేలో టాప్ 25 మందిని ఎంపిక చేశారు.అత్యం జనాదరణ కలిగిన నేతగా మోదీ ప్రధమ స్థానంలో ఉండగా ఆఖరి స్థానంలో జపాన్ ప్రధాని పునియో కిషిడా ఉండటం విశేషం. జపాన్ ప్రధాని కేవలం 16 శాతం జనాదరణ మాత్రమే కలిగి ఉన్నారు.


విదేశాలలో మోదీ హవా

ప్రధాని హోదాలో మోదీ గడచిన పదేళ్ల కాలంలో దాదాపు అన్ని దేశాలు చుట్టి వచ్చారు. గతంలో ఏ ప్రధాని కూడా వెళ్లని దేశాన్ని టచ్ చేసిన ఘనత మోదీదే. ఇంకా ఈ ఐదేళ్ల కాలంలో పెండింగ్ లో ఉన్న దేశాలను కూడా చుట్టబెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాలని చూస్తున్నారు. ఇంటర్నేషనల్ సమ్మిట్ లు ఏ దేశంలో నిర్వహించినా ప్రధాని మోదీకి తప్పనిసరిగా ఆహ్వానం ఉంటుంది. ఏ దేశానికి వెళ్లినా భారత సంప్రదాయ దుస్తులతోనే వెళతారు. అవకాశం దొరికితే భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటుతారు. భారత సంప్రదాయ రీతిలో రెండు చేతులతో నమస్కారం చేస్తుంటారు. మోదీని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు చాలా మంది విదేశీ నేతలు కూడా రెండు చేతులతో నమస్కారం పెట్టే సంస్కృతికి అలవాటు పడుతున్నారు. అందుకే భారత్ లోనూ మోదీని కొన్ని పత్రికలు, మీడియా విశ్వగురుగా వర్ణిస్తుంటాయి. భారత్ తో కలిసి ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు పెట్టేందుకు చాలా దేశాలు ఉత్సాహం చూపిస్తుంటాయి. మోదీ తన విధానాలతో ఇలా ఇంట గెలిచి..రచ్చ గెలుస్తున్నారు అని చెప్పవచ్చు.

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×