BigTV English

Friendship Day 2024: ఫ్రెండ్ షిప్ డే.. ఎప్పుడు.. ఎలా మొదలైందో తెలుసా..?

Friendship Day 2024: ఫ్రెండ్ షిప్ డే.. ఎప్పుడు.. ఎలా మొదలైందో తెలుసా..?

Friendship Day special story: ప్రతి సంవత్సరం ఆగష్టు మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. 1935 లో యునైటెడ్ స్టేట్ కాంగ్రెస్ ఆగష్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ఆరోజు అందరూ తమ స్నేహితులపై తమ ప్రేమను వ్యక్తపరచడానికి కార్డులు, ఫ్రెండ్ షిప్‌ బ్యాండ్‌లు ఇచ్చుపుచ్చుకుంటారు. “అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింప చేసే ఏకైక పదం స్నేహం”. స్నేహానికి వయసు, కులము, మతము అనే బేధాలు ఉండవు. నిజమైన స్నేహితులు కష్ట సమయాల్లోను మనతో కలిసి ఉంటారు. స్నేహితుడులోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు. స్నేహితులు చేసిన తప్పులను గురువులా బోధించే వాడే స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు.


ప్రతిరోజు మాట్లాడుకోకున్న అవసరమైనప్పుడు మనకు తోడుగా ఉంటారు. ఒక అవమానం వస్తే ప్రపంచం నుండి పారిపోతాం కానీ పరిగెత్తేది మాత్రం ఒక స్నేహితుడి భుజం దగ్గరికే. అలసిపోతాం కానీ చనువుగా విసుగు చూపించకలిగేది ఆ దోస్త్ మీదనే.. ఎవరైన టీజ్ చేసిన, కామెంట్ చేసిన వాడు అడ్డు నిలబడితే ఒక్కొక్కల్లం పెద్ద హీరోస్ లాగా ఫీలైపోతాము.. ఇంట్లో ఇరింకించేస్తాడు కానీ.. బయట మనకోసం తానే ఇరుక్కు పోతాడు. ప్రపంచంలో ప్రేయసి దగ్గర, అన్నల దగ్గర, తమ్ముళ్ల దగ్గర ఆఖరి అమ్మా నాన్నల దగ్గర రిస్ట్రెక్షన్ లు ఉంటాయి కానీ ఒక ఫ్రెండ్ దగ్గర మాత్రం ఎలాంటి రిస్ట్రెక్షన్ లు ఉండవు. ఎవ్వరి దగ్గరైన సీక్రెట్స్ దాయగలం కానీ పాపం మన సీక్రెట్స్ వినీ వినీ చెవులు ఎంత  వాచి పోయాయో ఏంటో.. స్నేహం ఎక్కడెక్కడ పుట్టిన మనుషుల్ని ఏ రక్త సంబంధం లేకుండానే కట్టి పడేసే ఒక ఫెవికాల్.

Also Read: స్నేహ బంధాన్ని చాటి చెప్పిన సినిమాలు.. ఇప్పుడు చూసినా కన్నీళ్లు ఆగవు..!


“చెడి చెల్లెలు ఇంటికి వెళ్లకూడదు కానీ స్నేహితుడి దగ్గర చెయ్యి చాచొచ్చు” లాంటి సామెతలు భాషలో పుట్టాయంటే స్నేహానికి మనం ఇచ్చే వాల్యూ ఏంటో అర్ధమవుతుంది. బంధాలు, బంధుత్వాలు లేని మనుషులు ఉండొచ్చు కానీ స్నేహితులు లేని మనుషులు ఉండరంటే అతిశయోక్తి కాదు. గొంతులో ఉన్న తేడాన్ని బట్టి ఏమూడ్ లో ఉన్నామో చెప్పేసే శక్తి అమ్మ తర్వాత ఒక ఫ్రెండ్ మాత్రమే. కృష్ణుడు, కుచేలుడైన, డేవిడ్ అండ్ జొనార్తన్ అయిన నువ్వు ఇప్పుడు నీ మైండ్ లో మెదిలే రూపమైన స్నేహానికి కట్టు బానిసలమే. ఎన్ని గొడవలైన ఏ అరమరికలు లేకుండా సింపుల్ గా చెప్పాలంటే ఏ సిగ్గు లేకుండా మళ్లీ ఈజీగా కలగలసిపోయో బంధం ఏదైన ఉందంటే అది స్నేహమే. మీ ఫ్రెండ్ మీతో కాకుండా ఎవరో ఇంకొక పర్శన్ తో క్లోజ్‌గా ఉంటే ఒళ్లు మండిపోదు.

“వీధిలో ఫ్రెండ్స్, కాలేజీలో ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ , ఆఫీస్ లో ఫ్రెండ్స్ , ఏ ఫ్రెండ్స్ అయిన సరే.. మీకోసం మీ విష్ కోసం ఎదురుచూస్తూ విశ్వమే స్నేహ హస్తం చాచి చూస్తుంది. మనసారా మీ స్నేహితుల్ని విష్ చేసేయండి. వాళ్ల కష్ట నష్టాల్లో నేనున్నానని మరొక సారి భరోసా ఇవ్వండి. అలసిన జీవితాల్లో ఇంకోసారి ధైర్యాన్ని నింపండి”.

Related News

Anil Ambani: అంబానీకి ఊహించని షాక్.. తల్లి ఆస్పత్రిలో ఉండగానే ఇంట్లో సీబీఐ సోదాలు

Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లోని క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. అల్లకల్లోలంగా మారిన చమోలీ జిల్లా

Stray Dog vs Leopard: మనతో మామూలుగా ఉండదు.. పులినే లాక్కెళ్ళిన కుక్క

Kokila Ben: ముఖేష్ అంబానీ తల్లికి అస్వస్థత.. హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలింపు

SC on Stray Dogs: వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అన్ని రాష్ట్రాల సీఎస్ లకు నోటీసులు జారీ

TVK Vijay: సింగిల్ సింహం.. విజయ్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారా?

Big Stories

×