E-Paper
Advertisement

Trump Hints Next War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ.. ఇరాన్ తర్వాత ఆ దేశంపై వార్

Trump Hints Next War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ.. ఇరాన్ తర్వాత ఆ దేశంపై వార్
Advertisement

Trump Hints Next War: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలను ప్రపంచ దేశాలను గందరగోళంలో పడేస్తున్నాయి. తన పాలనా కాలంలో యుద్ధాలు చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం చేస్తోంది అమెరికా. ఇది ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. నెక్ట్స్ టార్గెట్‌ని ఫిక్స్ చేసుకున్నారు అమెరికా అధ్యక్షడు ట్రంప్.

మరో యుద్ధానికి రెడీ అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Advertisement

ప్రపంచమంతా యుద్ద మేఘాలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నాయి. ఇంకో పాకిస్తాన్‌-ఆఫ్ఘనిస్థాన్ వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్దం ముగియగానే మరొక దేశాన్ని టార్గెట్ చేసినట్టు చెప్పారు. ఇరాన్ తర్వాత క్యూబా సంగతి తేలుస్తామని వ్యాఖ్యానించారు.

మరొక యుద్ధం తప్పదని సంకేతాలు ఇచ్చేశారు. అక్కడి కాలమాన ప్రకారం గురువారం వైట్‌హౌస్‌లో మాట్లాడిన ఆయన, ఇరాన్‌పై యుద్ధం జరుగుతోందని చెప్పారు. దాని తర్వాత క్యూబా సంగతి తేలుస్తామని చెప్పకనే చెప్పారు. అమెరికాతో డీల్ చేసుకునేందుకు క్యూబా ఉత్సాహంగా ఉందని, మాట వినకుంటే ఆ పరిస్థితి వస్తుందన్నారు.

Advertisement

ఇరాన్ తర్వాత తదుపరి టార్గెట్ క్యూబా-ట్రంప్

అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానాలకు  క్యూబా ప్రభుత్వ విధానాలు తీవ్ర ముప్పుగా మారిందని వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును పూర్తిగా తొలగించడమే తమ ప్రస్తుత లక్ష్యమని, తర్వాత దృష్టి క్యూబాపై ఉంటుందని స్పష్టం చేశారు. చమురు విక్రయించే ఏ దేశమైనా టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు ట్రంప్. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు.

క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ఇరాన్ సైనిక సామర్థ్యాలు భారీగా క్షీణించాయని ఇదే సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇరాన్ సైన్యానికి వైమానిక దళం లేదని, దానికి సంబంధించి రక్షణ లేదన్నారు. అమెరికా బలగాలు కేవలం మూడు రోజుల్లో 24 ఇరాన్ నౌకలను ధ్వంసం చేశాయన్నారు. యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ నాయకులు చర్చలు జరుపుతున్నారని అన్నారు.

ALSO READ: మధ్యప్రాచ్యంలో ముదిరిన యుద్ధం.. ఇరాన్ డ్రోన్ క్యారియర్‌పై అమెరికా మెరుపు దాడి!

వారు ఫోన్ చేస్తున్నారని, ఎలా ఒప్పందం చేసుకోవాలని అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. మీరు చాలా ఆలస్యం చేశారని, తాము వారి కంటే ఎక్కువగా పోరాటం చేయాలని అనుకున్నట్లు చెప్పారు. ఇరాన్ దౌత్యవేత్తలు తమ దేశ రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించడంలో సహాయం చేయాలని కోరినట్టు వివరించారు. మెరుగైన ఇరాన్‌ను రూపొందించడంలో సహాయపడగలమని ట్రంప్ అన్నారు.

 

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×