E-Paper
Advertisement

Property Tax: సాకులు చెపుతూ పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

Property Tax: సాకులు చెపుతూ పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

Property Tax: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని ప్రజల అవసరాలకు తగిన అభివృద్దితో పాటు పౌర, అత్యవసర సేవలందిస్తున్న మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ ను వర్తమాన ఆర్థిక సంవత్సర లక్ష్యానికి తగిన విధంగా వసూలు చేసుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు. రొటీన్ గా జరుగుతున్న వర్తమాన ట్యాక్స్ బాకాయిల వసూళ్లతో మూడు కార్పొరేషన్లపై ఇప్పటి వరకు రూ. 2 వేల కోట్ల పై చిలుకు ట్యాక్స్ కలెక్షన్ అయింది. లక్ష్యానికి మిగిలిన రూ. వెయ్యి కోట్లను ఈ నెలాఖరులోకా వసూలు చేసుకునేందుకు అధికారులు వ్యూహాన్ని సిద్దం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఏళ్ల తరబడి కోట్లాది రూపాయల ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ ఎగవేస్తున్న బడా బాబులు, బడా సంస్థలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపేందుకు సిద్దమైంది.

జాబితా సిద్దం..

వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-2026) ముగింపు దశకు చేరినందున మొండి బకాయిలను వీలైనంత ఎక్కువగా వసూలు చేసుకునే అంశంపై మూడు కార్పొరేషన్ల అధికారులు దృష్టి సారించారు. హై-వాల్యూ కమర్షియల్ వాణిజ్య డిఫాల్టర్ల భరతం పట్టేందుకు సిద్ధమైంది. సామాన్యుల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు ఎన్నో ఏళ్లుగా పన్ను చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న కార్పొరేట్ సంస్థలు, హోటళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల జాబితాను సిద్దం చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ భారీగా బకాయి పడ్డ ఆస్తులను సీజ్ కూడా చేస్తున్నారు. ప్రధానంగా నగరంలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని ప్రముఖ కమర్షియల్ ప్రాపర్టీల యజమానులే ఈ ఎగవేతదారుల జాబితాలో టాప్‌లో ఉన్నట్లు తెలిసింది. నగరవ్యాప్తంగా కేవలం కమర్షియల్ ఆస్తుల నుంచే జీహెచ్ఎంసీకి సుమారు రూ.900 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్ల వరకు పేరుకుపోయినట్లు సమాచారం.

కొందరు టాప్ డిఫాల్టర్ల వివరాలు

జీహెచ్ఎంసీ అంతర్గత సర్కిళ్ల వారీగా సిద్ధం చేసిన ఈ టాప్ డిఫాల్టర్ల జాబితాలో సంచలన పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ పన్ను ఎగవేతదారుల జాబితాలో ‘హైదరాబాద్ ఆస్బెస్టాస్ సిమెంట్’ సంస్థ ఏకంగా రూ.13 కోట్ల మేరకు బకాయిండగా, కోర్టు వివాదాల సాకుతో ఈ సంస్థ ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతంలో నివాస, వాణిజ్య సముదాయాలు కలిగిన కృపా దేవి తదితరులు రూ.6.4 కోట్లు, ఎప్పటినుంచో బల్దియాకు పన్ను చెల్లించకుండా చుక్కలు చూపిస్తున్న శ్రీ లక్ష్మీ గాయత్రి హోటల్స్ కత్రియా హోటల్స్ రూ.6.13 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయి. గతంలో భారీగా పన్ను బకాయి పడ్డ వ్యాపార సంస్థలు, భవనాలకు చెందిన వాహనాలు, ఫర్నిచర్‌ను జీహెచ్ఎంసీ సీజ్ చేసినప్పటికీ వారి తీరు మారలేదు. మరి కొన్ని సందర్భాల్లో పన్ను బకాయి పడ్డ వ్యాపార సంస్థల ముందు జీహెచ్ఎంసీ అధికారులు చెత్త వాహానాలతో చెత్త తెప్పించి వేసే వారు. కానీ ఈ వ్యవహారంలో కొందరు కోర్టును ఆశ్రయించటంతో జీహెచ్ఎసీ అధికారులు ట్యాక్స్ వసూలు చేసుకునేందుకు అనుసరిస్తున్న విధానంపై కోర్టు తప్పుబట్టడటంతో జీహెచ్ఎంసీ అధికారులు వెనక్కి తగ్గారు.

Also Read: Ward Administration: గద్వాల్‌లో రోజురోజుకు పెరుగుతున్న కబ్జాల పర్వం

జీహెచ్ఎంసీ రికార్డులు..

అలాగే జూబ్లీహిల్స్‌కు చెందిన సందేశ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.4.45 కోట్లు, హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.3.5 కోట్లు, ఐటీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.3.5 కోట్ల మేర ఆస్తిపన్ను బకాయి పడినట్లు జీహెచ్ఎంసీ అధికారులు రూపొందించిన జాబితాలోని సమాచారం. రాజేంద్రనగర్ పరిధిలోని ఎం.ఎస్ సుందర్ స్టీల్స్ రూ.2.95 కోట్లు, ఆషీ రియల్టర్స్ రూ.2.37 కోట్లు, యూసుఫ్‌గూడకు చెందిన ప్రీ స్టీల్స్ ఫ్యాబ్రిక్స్ రూ.2.23 కోట్లు, ప్రముఖ లీలా హోటల్స్ (హోటల్ లీలా వెంచర్స్) రూ. కోటిన్నర వరకు ట్యాక్స్ బకాయిలు చెల్లించాల్సి ఉందని జీహెచ్ఎంసీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బడా బకాయిదారుల నుంచి పన్ను వసూలు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కొంత కఠినంగా వ్యవహారించాలని భావిస్తున్నారు. లీగల్ యాక్షన్‌కు దిగే ముందు ఫైనల్ వార్నింగ్‌గా ఈ హై-వాల్యూ డిఫాల్టర్లందరికీ జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ‘రెడ్ నోటీసులు’ జారీ చేస్తుంది. ఈ నోటీసులు అందుకున్న తర్వాత కూడా పన్ను చెల్లించని వారిపై జీహెచ్ఎంసీ యాక్ట్ లోని సెక్షన్ 269 కింద డిస్ట్రెస్ వారంట్లు జారీ చేసి, వారి ప్రాపర్టీలు, షాపులను సీజ్ చేయడంతో పాటు, మూవబుల్ ఆస్తులైన వాహనాలను సైతం జప్తు చేసేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.

ఓటీఎస్ తో మొండి బకాయిలకు ఊరట

ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలు చెల్లిస్తే, ఆ బకాయిలను ప్రస్తుతం అమలు చేస్తున్న వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) స్కీమ్ కింద చెల్లిస్తే, బకాయిలకు ఇప్పటి వరకు వర్తింపజేసిన వడ్డీలో సుమారు 90 శాతం మినహాయించనున్నారు. ఏళ్లుగా పేరుకుపోయిన ట్యాక్స్ బకాయిలు చెల్లించే వారికి ఈ వడ్డీ మాఫీ చాలా ఊరటనివ్వనుంది. కానీ జీహెచ్ఎంసీ అధికారులు ఓటీఎస్ పై తగినంత ప్రచారం, బకాయిదారులకు అవగాహన కల్పించకపొవటంతో మొండి బకాయిలు ఆశించిన స్థాయిలో వసూలు కావటం లేదని తెల్సింది. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. టాప్ డిఫాల్టర్లు తక్షణమే ఆన్‌లైన్ ద్వారా లేదా సంబంధిత అధికారులను సంప్రదించి ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకుని బకాయిలు క్లియర్ చేసుకోవాలని, లేని పక్షంలో రానున్న ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా అయిదు శాతం రాయితీనిచ్చే విధానాన్ని అమలు చేయటంతో పాటు మొండి బకాయిలకు చెందిన ఆస్తుల జప్తు ను కూడా కొనసాగిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఆస్తుల సీజింగ్ కు సంబంధించి ఇప్పటికే సర్కిల్ లో డిప్యూటీ కమిషనర్, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్, బిల్ కలెక్టర్లతో కమిటీలను కూడా నియమించినట్లు సమాచారం.

Also Read: Maoist Son Letter: నాన్నా.. నిన్ను చూడాలని ఉంది అంటూ.. మావోయిస్టు కుమారుడి ఆడియో వైరల్..!

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×