BigTV English

Russia elections: మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికలు.. మరోసారి పుతినే పక్కా అంటున్న సర్వేలు..?

Russia elections: మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికలు.. మరోసారి పుతినే పక్కా అంటున్న సర్వేలు..?

putin latest newsRussia president elections 2024(Telugu flash news): రష్యా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు నేడు మొదలయ్యాయి. రష్యాలో ఇంతవరకూ ఎన్నడూ లేని విధంగా నేటి నుంచి మూడు రోజుల పాటు పోలింగ్ జరగనుంది. గతంలో రష్యాలో ఒక్కరోజు మాత్రమే ఎన్నికలు జరిగేవి. ఈసారి మాత్రం దానికి భిన్నంగా పోలింగ్ ప్రారంభమైంది.


రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ పై దాడికి దిగి ప్రపంచ చూపును తనవైపు తిప్పుకున్న నాయకుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అయితే పుతిన్ గత కొన్నేళ్లుగా రష్యాలో అధికార పీఠాన్ని తన గుప్పెట్లో ఉంచుకుని నియంత పాలన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. కాగా, నేడు రష్యా అధ్యక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికలు 15, 16, 17వ తేదీల్లో జరగనున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని చోట్లా పోలింగ్ మొదలైంది. అయితే ఈ ఎన్నికల్లో దాదాపు 11.42 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 17వ తేదీన తుది ఓటింగ్ పూర్తి కాగానే.. 19వ తేదీకల్లా తొలి విడత ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. తుది ఫలితాలు మాత్రం మార్చి 29న విడుదలవుతాయని.. రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వెల్లడించింది.

Also read : ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఇది ఏం చేస్తుందో తెలుసా ?


గత 4 పర్యాయాలుగా అధ్యక్ష పీఠంలో ఉన్న పుతిన్ మరోసారి తానే దేశ అధ్యక్షుడిని అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రష్యాలోని అన్ని ప్రాంతాల్లో తాను తప్పకుండా గెలుస్తాననే నమ్మకంతో ఉన్న పుతిన్.. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు. ఆక్రమిత ప్రాంతాల్లో తాను గెలుపొంది.. ఉక్రెయిన్ విషయంతో తాను చేస్తున్నది ధర్మ యుద్ధమేనని ప్రపంచానికి చాట చెప్పాలని భావిస్తున్నారు. పుతిన్ కు పోటీగా ఎల్ డీపీఆర్ నేత లియోనిడ్ స్లట్ స్కీ, న్యూ పీపుల్ పార్టీ నేత వ్లాదిస్లేవ్ దవాన్ కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ నేత నికోలే ఖరిటోనేవ్ లు ఈ సారి బరిలో నిలబడ్డారు. అయితే రష్యాలో చేప్పట్టిన ముందస్తు సర్వేల్లో పుతిన్ కు ప్రజలనుంచి 75 శాతం మద్దతు ఉందని.. మిగిలిన వీరింతా తలో 5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని తేల్చాయి.

Tags

Related News

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Big Stories

×