BigTV English

Meet Devin AI: ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఇది ఏం చేస్తుందో తెలుసా ?

Meet Devin AI: ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఇది ఏం చేస్తుందో తెలుసా ?

Meet Devin AI, the world's 'first fully autonomous' AI software engineer


Meet Devin World’s first AI Software Engineer Devin Announced(Tech news today ): సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాత్మక ఆవిష్కరణలకు కృత్రిమ మేధ ఏఐ, చాట్ జీపీటీ.. ప్రస్తుతం అంతా టెక్నాలజీ మయం. కృత్తిమ మేధ ఏఐ ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తుంది. టెక్నాలజీతో సృష్టించిన మాయా.. న్యూస్ రీడర్ గా వార్తలు చదవడం దగ్గరి నుంచి పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ గా.. ఇప్పుడు ఏకంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవతారమెత్తి ప్రోగ్రామ్స్ ను రాసే స్థాయికి ఎదిగింది ఈ రోబో.

తాజాగా అమెరికాకు చెందిన కాగ్నిషన్ అనే స్టార్టప్ కంపెనీ ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సృష్టించింది. దానికి “డెవిన్” అనే పేరు పెట్టారు. ఈ రోబో వెబ్ సైట్లను, సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లను పూర్తి స్తాయిలో తయారు చేసి ఇవ్వగలదని, ఇచ్చిన ఇన్ పుట్స్ కి అనుగుణంగా నచ్చిన వీడియోలను క్రియేట్ చేస్తుంది. కోడ్ రాయడం దగ్గరి నుంచి టెస్టింగ్ , డీబగ్గింగ్ చేయడం , డిప్లాయ్ కూడా చేయగలదని కాగ్నిషన్ కంపెనీ ప్రకటించింది.


Also Read: ప్రయోగించిన కొన్ని సెకన్లలో పేలిన జపాన్ ఉపగ్రహం.. వీడియో వైరల్

మనం అడిగే ప్రశ్నలకు ఏఐ దాదాపు ఖచ్చితంగా సమాధానాలు ఇస్తుందని భావిస్తాం. అయితే ఏఐ యూనివర్సల్ గ్రాఫ్ లో చాట్ జీపీటీ ఖచ్చితత్వాన్ని 0.52 శాతం లెక్కిస్తే డెవిల్ రోబో మాత్రం 13.86 శాతం వరకు గుర్తించింది దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు ఈ రోబో ఎంత ఖచ్చితత్వంతో ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేస్తుందో అని. కేవలం సిస్టమ్ లో ప్రోగ్రామ్స్ ని సృష్టించడమే కాదు.. సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ సమర్ధవంతంగా పనిచేస్తున్నాయా లేదా అని కూడా చెక్ చేస్తుందట.

ఏఐ సాఫ్ట్ వేర్ ను తీసుకొస్తే తమ ఉద్యోగాలు మాటేమిటి అన్న అనుమానాలు వ్యక్తం చేసేవారికి కాగ్నిషన్ కంపెనీ ఒక స్పష్టత ఇచ్చింది. దీనిని పూర్తి స్తాయిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అందరూ వినియోగించుకోవాలని.. కేవలం వారి పనులని సులభతరం చేయడంలో భాగంగా మాత్రమే డెవిన్ ను రూపొందించామని పేర్కొంది.

 

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×