E-Paper
Advertisement

UAE Heavy Rains: యూఏఈని ముంచెత్తిన భారీ వర్షాలు.. షార్జా వీధులు జలమయం, ఆగిన మిస్సైళ్ల శబ్దాలు

UAE Heavy Rains: యూఏఈని ముంచెత్తిన భారీ వర్షాలు.. షార్జా వీధులు జలమయం, ఆగిన మిస్సైళ్ల శబ్దాలు
Advertisement

UAE Heavy Rains: యూఏఈ వ్యాప్తంగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గతరాత్రి నుంచి వివిధ నగరాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో వివిధ నగరాల్లో జనజీవనం స్తంభించింది. పరిస్థితి గమనించిన అక్కడ ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది.

ఆగిన మిస్సైళ్ల శబ్దాలు.. యూఏఈని ముంచెత్తిన భారీ వర్షాలు

Advertisement

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గడిచిన మూడువారాలుగా యూఏఈలో రాత్రి పగలు డ్రోన్లు, మిసైళ్లు శబ్దాలు వినిపించేవి. అయితే గడిచిన రెండు రోజులుగా వాటి శబ్దాలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా చివరి విడత భారీ వర్షం కురిసింది.

శనివారం నుంచి వాతావరణం కుదుటపడుతుందని అక్కడి జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు దుబాయ్, అబుదాబీ, షార్జా సహా పలు నగరాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురిశాయి.

Advertisement

షార్జా వీధులు జలమయం.. పలు విమాన సర్వీసులకు అంతరాయం

భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాలలో జన జీవనం ఆగిపోయింది. పరిస్థితి గమనించిన అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచన చేసింది.

మరోవైపు భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు తీవ్రమయ్యాయి. ఫలితంగా యూఏఈ నుంచి గల్ఫ్ లోని వివిధ నగరాలకు వెళ్లే కొన్ని విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్నింటిని అధికారులు రద్దు చేశారు. శనివారం నుంచి వర్షాల తీవ్రత తగ్గింది. కాకపోతే ఆకాశం మేఘావృతమై ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. అక్కడ ఈ సీజన్‌లో కురిసిన అత్యంత నమోదైన వర్షాల్లో ఇదే చివరిది. రానున్న రోజుల్లో ఎండలు ప్రారంభమవుతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

ALSO READ: అమెరికా విమానాశ్రయాల్లో షట్‌డౌన్ సెగ.. గంటల కొద్దీ నిరీక్షణతో ప్రయాణికుల అవస్థలు

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×