E-Paper
Advertisement

Delimitation: డీ లిమిటేషన్ అంశంతో నేతల్లో టెన్షన్ టెన్షన్.. పాత నాయకులకు చుక్కలేనా..?

Delimitation: డీ లిమిటేషన్ అంశంతో నేతల్లో టెన్షన్ టెన్షన్.. పాత నాయకులకు చుక్కలేనా..?

Delimitation: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర లీడర్లకు డీ లిమిటేషన్ ప్రక్రియ కొత్త టెన్షన్ ను పెడుతున్న ది. ఇప్పటి వరకు అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న నేతలు సంతోషం వ్యక్తం చేస్తుండగా, ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు మాత్రం కాస్త ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ప్రధానంగా రిజర్వడ్ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. డీ లిమిటేషన్ లో తమ స్థానం కోల్పోతామేమోనన్న భయం ఆయా శాసన సభ్యుల్లో ఉన్నది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో మార్పులు జరిగితే మళ్లీ పోటీ చేసే ఛాన్స్ ను కోల్పోతామన్న భయం కొందరిలో ఉండగా, కొత్త నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ప్రభావం చూపడం కష్టమని మరి కొంత మంది ఎమ్మెల్యేలు ఫీలవుతున్నారు.జనరల్ స్టానాలుగా మారితే కాంపిటేషన్ మరింత పెరుగుతుందని ,తద్వారా సీటు కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నదని రిజర్వడ్ సెగ్మెంట్లలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. డీ లిమిటేషన్ ప్రాసెస్ తమకు కొత్త చిక్కులు సృష్టించేలా ఉన్నదని ఎస్టీ రిజర్వడ్ సెగ్మెంట్ కు చెందిన ఓ ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని తెలిపారు.

సీట్లతో పాటు సెగ్మెంట్లు కూడా..

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం, నియోజకవర్గాలను తగ్గించడం లేదా పెంచటాన్ని డీ లిమిటేషన్ గా పరిగణిస్తారు. అన్ని నియోజకవర్గాల్లో సుమారు రెండు లక్షల మంది ఓటర్లు ఉండేలా డీ లిమిటేషన్ జరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు 5 నుంచి 8 లక్షల ఓటర్లు కూడా ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో 119 సెగ్మెంట్ల నుంచి 179 కు పెరిగే ఛాన్స్ ఉన్నదని అంచానా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ స్థానాల్లో కొన్ని జనరల్ గా మారే ఛాన్స్ ఉన్నదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. మండలాలు, సరిహద్దులు మారడం వలన జనరల్ కేటగిరీలోకి వెళ్లే ఛాన్స్ ఉన్నది. దీంతో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ సెగ్మెంట్లలో శాసన సభ్యులుగా ఉన్న నేతలు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం నుంచి 43 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, వెలమలు 13 మంది, కమ్మ వర్గం నుంచి నలుగురు, బ్రాహ్మణ, వైశ్యుల నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక బీసీ ఎమ్మెల్యేలు 19 మంది ఉండగా, ఎస్సీలు 19, ఎస్టీలు 12 మంది ఉన్నారు. దీంతో పాటు పాతబస్తీలోని 7 నియోజకవర్గాల్లో ముస్లీం మైనార్టీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు.

Also Read: CM Revanth Reddy: కుటుంబ సమేతంగా భద్రాచలం.. రామయ్యని దర్శించుకున్న సీఎం

33 శాతం మహిళా రిజర్వేషన్ తోనూ..

డీ లిమిటేషన్ తర్వాత 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనున్నది. కేంద్రం తీసుకురాబోతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు డీ లిమిటేషన్ తర్వాత అమలు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. అంటే మొత్తం సీట్లలో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు ఆశావహులుగా ఉన్న లీడర్లు , మరో సెగ్మెంట్ వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. డీ లిమిటేషన్ తర్వాత దాదాపు 50 సీట్లకు పైనే మహిళలకు వచ్చే ఛాన్స్ ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో కొందరు లీడర్ల తమ కుటంబ సభ్యుల్లోని మహిళలను రంగంలోకి దించే అవకాశం ఉన్నది. ఇంకొందరు ఇతర నియోజకవర్గాల్లో సీటు కోసం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అయితే సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ, రిజర్వేషన్ల మార్పుల వల్ల జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రం కానుంది. ప్రస్తుతం జనరల్ స్థానాల్లోని సీనియర్ నేతల్లో కూడా తమ స్థానం రిజర్వడ్ జాబితాలోకి వెళ్తుందేమోన్న భయం కూడా ఉన్నది.

నేతలకు ఎదురయ్యే సమస్యలు ఇలా..

నియోజకవర్గాల సరిహద్దులు మారడం వల్ల, ఒక నేతకు పట్టున్న గ్రామాలు మరో నియోజకవర్గంలోకి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల ఏళ్ల తరబడి పెంచుకున్న ఓటు బ్యాంకు చెదిరిపోయే ప్రమాదం ఉంది. అంతేగాక స్థానాల సంఖ్య పెరగడంతో యువత, ద్వితీయ శ్రేణి నాయకులు పోటీలోకి దిగే ఛాన్స్ ఉన్నది. దీంతో ఇప్పటి వరకు హవా నడిపించిన లీడర్లు, అవకాశాలు వదులుకోవాల్సి వచ్చే ప్రమాదం ఉన్నది. నియోజకవర్గాల పుపర్విభజన వలన నియోజకవర్గం పరిధి చిన్నగా మారితే ఖర్చు కూడా తగ్గుతుందని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరల్ గా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు నేతల భవితత్వాన్ని మార్చే విధంగా ముందుకు సాగనున్నది.

Also Read: Rahul Ramakrishna: రాహుల్ రామకృష్ణ ఇంట విషాదం.. వాటిని బ్యాన్ చేయండంటూ పీఎంకు రిక్వెస్ట్!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×