E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఇరాన్-అమెరికా యుద్ధం మొదలు.. హార్మూజ్‌ జలసంధి మూసివేత, ఇరాన్‌కు ట్రంప్ కొత్త అల్టిమేటం!

ఇరాన్-అమెరికా యుద్ధం మొదలు.. హార్మూజ్‌ జలసంధి మూసివేత, ఇరాన్‌కు ట్రంప్ కొత్త అల్టిమేటం!
Advertisement

Strait Of Hormuz: ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో విధంగా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరగకుండా ఇజ్రాయెల్ తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఇరాన్. ఇరాన్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయ్యారు.

ఇరాన్-అమెరికా యుద్ధం మొదలు

Advertisement

ఈ ఏడాది చివరలో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తీరుపై ఆ దేశంలో నిరసనలు జోరందు కున్నాయి. పరిస్థితి గమనించిన ఇజ్రాయెల్.. ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. లెబనాన్‌పై భీకరంగా విరుచుకుపడుతోంది.

ఇజ్రాయెల్ దూకుడ్ని గమనించిన ఇరాన్, కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని మూసి వేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇరాన్ నిర్ణయంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఇరాన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది రెండోసారి.

Advertisement

హార్మూజ్‌ జలసంధిని మూసివేసిన ఇరాన్..  ట్రంప్ సంచలన ప్రకటన

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇజ్రాయెల్.. లెబనాన్‌పై నిరంతర దాడులకు దిగుతోందని ఆరోపించింది ఇరాన్. శనివారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుమారు 30 మంది మరణించినట్లు లెబనాన్ మీడియా చెబుతోంది. ఈ దాడులకు నిరసనగా హర్మూజ్ జలసంధిని తాము పూర్తి నియంత్రణను తిరిగి చేపట్టినట్లు ఇరాన్ సైనిక కమాండర్ తెలియజేశారు.

ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఐదో వంతు హోర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య అణు చర్చలు జరగాలని భావిస్తున్న తరుణంలో ఇరాన్ నిర్ణయం ఆ చర్చలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఇరాన్ తీసుకున్న చర్య వైట్‌హౌస్ రియాక్ట్ అయ్యింది. దౌత్యపరమైన చర్చలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించింది.

ALSO READ: ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు, ఒప్పందంలోని కీలక అంశాలివే

అమెరికా-ఇరాన్ మధ్య రెండునెలలపాటు తాత్కాలిక కాల్పుల ఒప్పందం జరిగింది. ఈలోపు ఇరు దేశాల మధ్య శాశ్వత ఒప్పందం జరగాల్సి వుంది. తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో గడువు ముగిసినా హార్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే నౌకలపై ఎలాంటి టోల్ వసూలు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్‌తో అణు చర్చలు విఫలమైతే అమెరికా టోల్ విధిస్తుందంటూ హెచ్చరించారు.

ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్ వేదికగా ఆదివారం నుంచి ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు మొదలుకానున్నాయి. ఇరుదేశాల ప్రతినిధులు అప్పటికే అక్కడకు చేరుకున్నారు. యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయడంలో అమెరికా విఫలమైందని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తోంది అమెరికా సెంట్రల్ కమాండ్.

 

Related News

ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు, ఒప్పందంలోని కీలక అంశాలివే

నెతన్యాహుపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. ‘నేనే లేకపోతే ఇజ్రాయెల్ సర్వనాశనమయ్యేది’

సుందర్ పిచాయ్‌ కి షాక్.. ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్!

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!

సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. 130 అడుగుల ఎత్తు నుంచి యువతిని తోసేసి..

ఎట్టకేలకు యుద్ధం ముగిసింది.. ఇరాన్-అమెరికా మధ్య డీల్, ట్రంప్ కీలక ప్రకటన, జలసంధి ఓపెన్

కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం.. ప్రముఖ కాఫీ షాప్‌నకు భారీ షాక్.. రూ.4 లక్షల ఫైన్!

Big Stories

×