E-Paper
Advertisement

రష్యా బీచ్‌పై డ్రోన్ దాడి.. 7 గురు మృతి, 40 మందికి గాయాలు

రష్యా బీచ్‌పై డ్రోన్ దాడి.. 7 గురు మృతి, 40 మందికి గాయాలు
Advertisement

Russian Beach: రష్యాలోని ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవులను సరదాగా గడిపేందుకు బీచ్‌కి వచ్చిన టూరిస్టులపై ఒక్కసారిగా మరణమృదంగం మోగింది.

సముద్ర తీరంలో హాయిగా గడుపుతున్న సమయంలో రష్యాలోని గెలెండ్‌జిక్ సమీపంలో ఉన్న ఆర్ఖిపో-ఒసిపోవ్కా బీచ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా భయాందోళనలతో అట్టుడికిపోయింది. ఉన్నట్టుండి విరుచుకుపడిన ఈ ఘోర దాడిలో ముగ్గురు చిన్న పిల్లలతో సహా మొత్తం ఏడుగురు పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో తొమ్మిది మంది పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతను చూపే దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సముద్ర తీరంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడం, భయంతో టూరిస్టులు, చిన్నపిల్లలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీయడం ఆ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తోంది.

సామాన్య ప్రజలు, చిన్నారులు లక్ష్యంగా జరిగిన ఈ దాడిపై రష్యా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పర్యాటక ప్రాంతంపై జరిగిన ఈ దాడిని రష్యా విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో ఖండించింది. బాధితులకు వెంటనే వైద్య సాయం అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Tags

Related News

పాకిస్థాన్‌లో ఘోరం.. మసీదు వద్ద ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి!

లాక్‌డౌన్ దిశగా పాకిస్థాన్ అడుగులు.. ఆ తరహా ఆంక్షలు, పెళ్లిళ్లలో ఒకే వంటకం

రష్యా చమురుపై అమెరికా బిగ్ ట్విస్ట్.. భారత్ వ్యూహం ఏంటి?

రష్యాని అష్టదిగ్భందం చేసిన అమెరికా.. చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై 100 శాతం పన్ను, అధికారాలు ట్రంప్‌కే

సూడాన్‌లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!

ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్‌లైన్!

సౌదీకి మరో బంగారు పంట.. భారీగా యురేనియం నిక్షేపాలు గుర్తింపు

న్యూయార్క్‌ సబ్‌వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. భారత సంతతి మహిళ, ఆమె ఫ్రెండ్‌పై దూసుకెళ్లిన రైలు

Big Stories

Advertisement
×