E-Paper
Advertisement

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

కార్చిచ్చులో దారుణమైన ఘటన..  గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి
Advertisement

Helicopters Collided: యూరప్‌ను కార్చిచ్చు చుట్టేస్తోంది. ఒక్కో దేశానికి క్రమంగా మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బెంబేలెత్తతున్నారు. తాజాగా కార్చిచ్చు కంట్రోల్ చేసే క్రమంలో రెండు హెలికాఫర్టు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.

గ్రీస్‌లో కార్చిచ్చు, ఊహించని ఘటన

గ్రీస్‌లో కార్చిచ్చులతో బలగాలు పోరాడుతున్న తరుణంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను కంట్రోల్ చేస్తున్న రెండు హెలికాప్టర్‌ గాల్లో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఏథెన్స్‌కు పశ్చిమాన పసాతా ప్రాంతంలో కార్చిచ్చును ఆర్పే ప్రయత్నంలో రెండు హెలికాప్టర్లు ఢీ కొన్నాయి. అటికా-బొయోటియా సరిహద్దులో చెలరేగిన మంటలను ఆర్పేందుకు రెండు బెల్ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ విషయాన్ని అగ్నిమాపక శాఖ తెలియజేసింది. ఘటన తర్వాత పైలట్లను అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించారు.

గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

Advertisement

అక్కడ వారి మరణాన్ని ధృవీకరించారు డాక్టర్లు. ఘటనకు సంబంధించిన ఫుటేజీలో ఒక హెలికాప్టర్ మరో హెలికాప్టర్ కింది భాగాన్ని ఢీ కొట్టి పేలిపోయి నేల కూలినట్టు కనిపించింది. మరొక హెలికాప్టర్ అందులోని సిబ్బందిని విజయవంతంగా రక్షించింది. మృతులలో ఒకరు డెన్మార్క్, మరొకరు గ్రీకు దేశానికి చెందినవారని ఆ దేశ ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ ఓ ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. ఈ ప్రమాదంతో ఈ వారం గ్రీస్‌లో జరిగిన అగ్నిప్రమాదాల మృతుల సంఖ్య ఐదుకు చేరింది. రాబోయే రోజులు అత్యంత కష్టంగా ఉంటాయని ప్రధాని ఇంతకుముందు హెచ్చరించారు.

గ్రీస్‌లో ఏం జరుగుతోంది?

ఆస్ట్రేలియాకు చెందిన మెక్‌ డెర్మాట్ ఏవియేషన్ నుండి 15 హెలికాప్టర్లను లీజుకు తీసుకుంది గ్రీస్. ఏడేళ్లుగా గ్రీస్‌లోని కార్యకలాపాలకు తాము మద్దతు ఇస్తున్నామని సదరు సంస్థ తెలిపింది. తీవ్రమైన గాలుల కారణంగా అగ్నిమాపక చర్యలు చేపట్టడం ప్రమాదకరమని అధికారులు కొన్ని రోజులుగా హెచ్చరిస్తూ వచ్చారు. చివరకు ఆదివారం ఘటన జరగడంతో చాలా విమానాలను పక్కన పెట్టారు. గ్రీస్‌లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, ఆ సమయంలో డజన్ల కొద్దీ హెలికాఫ్టర్లు సురక్షితంగా పని చేయలేవని తెలిపింది.

Advertisement

ALSO READ: అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

 

Related News

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×