E-Paper
Advertisement

అచ్చం ‘ఈగ’ మూవీ లాగే.. ఈగను చంపేందుకు ఇల్లు తగలెట్టేసిన వృద్ధుడు!

అచ్చం ‘ఈగ’ మూవీ లాగే.. ఈగను చంపేందుకు ఇల్లు తగలెట్టేసిన వృద్ధుడు!
Advertisement

Fly Swatter Explosion: సినిమాల్లో మాత్రమే జరిగేలా అనిపించే కొన్ని సంఘటనలు కొన్నిసార్లు నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. అలాంటి ఓ విచిత్ర ఘటన ఫ్రాన్స్‌ లో జరిగింది. ఒక చిన్న ఈగను చంపాలని  ప్రయత్నించిన 82 ఏళ్ల వృద్ధుడు, అనుకోకుండా తన ఇళ్లు పేలిపోయేందుకుకారణమయ్యాడు. అసలు విషయం తెలిసి ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యం కలిగించింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఈ ఘటన ఫ్రాన్స్‌ లోని పార్కూల్ షెనాడ్ అనే చిన్న గ్రామంలో జరిగింది. రాత్రి భోజనం చేయడానికి రెడీ అవుతున్న సమయంలో ఒక ఈగ ఆయన చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పెట్టింది. దానిని తరిమేయాలని భావించిన వృద్ధుడు ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ ఈగల బ్యాట్‌ ను తీసుకుని ఆన్ చేశాడు. అయితే, ఆయనకు తెలియని విషయం ఏమిటంటే, అప్పటికే వంటగదిలో గ్యాస్ లీక్ అవుతోంది. గాల్లో గ్యాస్ వ్యాపించి ఉండటంతో, ఎలక్ట్రిక్ బ్యాట్‌ ను ఆన్ చేసినప్పుడు వచ్చిన చిన్న స్పార్క్ గ్యాస్‌కు తగలడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు వంటగది పూర్తిగా ధ్వంసమైంది. ఇంటి కప్పులో కొంత భాగం కూడా దెబ్బతింది. ఆ శబ్దంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు.

ప్రాణాలతో బయటపడ్డ వృద్ధుడు

Advertisement

అయితే, ఈ ప్రమాదంలో వృద్ధుడు ప్రాణాలతో బయటపడటం అదృష్టంగా చెప్పాలి. ఆయనకు చేతిపై స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. చికిత్స అనంతరం ఆరోగ్యంగా కోలుకున్నారు. కానీ, ఇల్లు తీవ్రంగా దెబ్బతినడంతో కొంతకాలం పాటు సమీపంలోని క్యాంప్‌ సైట్‌ లో ఉండాల్సి వచ్చింది.

రాజమౌళి ‘ఈగ’ సినిమాను గుర్తు చేసుకంటున్న నెటిజన్లు

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో కూడా ఒక ఈగ కారణంగా విలన్ ఇంట్లో పేలుడు సంభవించే సీన్ ఉంటుంది.  ఈ రియల్ ఇన్సిడెంట్ ను చాలామంది ఆ సినిమాతో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో అసలు కారణం ఈగ కాదు. ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుండగా ఎలక్ట్రిక్ బ్యాట్ ఉపయోగించడమే ప్రమాదానికి దారి తీసింది. ఈ ఘటన తర్వాత అత్యంత ఆసక్తికరంగా మారిన ప్రశ్న ఇంతకీ ఆ ఈగకు ఏమైంది?  పేలుడులో అది చనిపోయిందా? లేదంటే బయటపడిందా? అనే విషయం ఇప్పటికీ తెలియదు. ఈ అంశాన్ని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా సరదాగా ప్రస్తావించాయి.

ఫ్రాన్స్ కు వెళ్తే ఆ ఇల్లు చూడొచ్చు!

Advertisement

ఇక ఈ ఘటన జరిగిన ఇల్లు ఎలాంటి పర్యాటక ప్రదేశం కాదు.ఒక వ్యక్తి నివాసం మాత్రమే. ప్రస్తుతం ఇంటికి మరమ్మతులు పూర్తయ్యాయి. ఫ్రాన్స్‌ లోని పార్కూల్ షెనాడ్ గ్రామానికి వెళ్లిన వాళ్లు బయట నుంచి ఆ ఇంటిని చూడొచ్చు. ఒకవేళ ఓనర్ ఒప్పుకుంటే, లోపలికి వెళ్లి ఫోటోలు కూడా తీసుకోవచ్చు.

Read Also:పొద్దుతిరుగుడు పువ్వు నిజంగానే సూర్యుడి వైపు తిరుగుతుందా? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా!

Tags

Related News

ఇకపై RAC ప్రయాణికులకూ బెడ్ రోల్ కిట్ ఇవ్వాల్సిందే, రైల్వేశాఖ కీలక ఆదేశం!

జీవితంలో కచ్చితంగా చూడాల్సిన.. 7 పుణ్య క్షేత్రాలు.. పాపాలు పోవాలంటే తప్పదు భయ్యా!

నిద్రలో దిగాల్సిన స్టేషన్ దాటిపోతే.. ఫ్రీగా మరో రైల్లో వెనక్కి వెళ్లొచ్చా?

జంగిల్ సఫారీకి రెడీనా? అయితే, మీ కోసమే IRCTC క్రేజీ టూర్ ప్యాకేజీ రెడీ!

ముందొక రైలు.. వెనుకొక రైలు.. వామ్మో.. రాష్ట్రపతి ప్రత్యేక రైలు ఇలా ఉంటుందా?

ఉత్తరాంధ్రకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి వందే భారత్ స్లీపర్ కోసం ఎంపీ లేఖ!

సమయం లేదు మిత్రమా? ఇండిగో బంపరాఫర్.. 20 వేల మందికి ఫ్రీ టికెట్లు

Big Stories

Advertisement
×