E-Paper
Advertisement

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్
Advertisement

America: అమెరికాకు వచ్చే టూరిస్టులపై ట్రంప్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఏదో విధంగా అమెరికాలో మకాం వేసిన విదేశీయులకు పంపించే ప్రయత్నాలు కాదు, రాకుండా కట్టడి చేస్తోంది. ఈ నేపథ్యంలో వీసా బాండ్ పేరిట స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ సోమవారం అంటే ఆగష్టు మూడు నుంచి అమలు కానుంది. మరి ఈ స్కీమ్ ఏంటో ఓసారి లుక్కేద్దాం.

సోమవారం నుంచి వీసా బాండ్ స్కీమ్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలీదు. కాకపోతే దేశ ఖజానా పెంచే పనిలో నిగమ్నమయ్యారు. తాజాగా ట్రంప్ సర్కార్ 50 దేశాలపై వీసా బాండ్ బాంబు పేల్చింది. ఈ నిర్ణయం ఆగస్టు 3 అనగా సోమవారం అమల్లోకి రానుంది. వ్యాపారం-బీ 1, పర్యాటకం-బీ 2 వీసాల జారీకి కొత్త కార్యక్రమం చేపట్టింది. అదే శాశ్వత వీసా బాండ్‌ ప్రోగ్రామ్. దీన్ని 50 దేశాలపై అమలు చేస్తోంది. ఈ విషయంలో ఇండియాకు కాస్త సడలింపు ఇచ్చింది. వీసా బాండ్ కింద అమెరికాకు వెళ్లే పర్యాటకులు 20 వేల డాలర్ల బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. వీసా గడువు ముగిసినా ఆ దేశంలో ఉండిపోయేవారి సంఖ్య తగ్గుతోందని అధికారులు గుర్తించారు.

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్

Advertisement

దీన్ని ఇటీవల పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసింది. మంచి ఫలితాలు రావడంతో శాశ్వతంగా అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఫెడరల్ రిజిస్టర్ నోటీసు మేరకు.. పైలట్ ప్రోగ్రామ్ కింద ఎంపిక చేసిన దరఖాస్తుదారులు బాండ్‌ రూపంలో మొత్తం 5000 డాలర్లు, 10 వేల డాలర్లు, గరిష్ఠంగా 15 వేల డాలర్లు మాత్రమే ఉండేది. కొత్త నిబంధనల్లో 5000 డాలర్ల ఆప్షన్‌ను తొలగించి 20 వేల డాలర్లకు పెంచేసింది ట్రంప్ ప్రభుత్వం. ఇండియన్ కరెన్సీలో అంటే సుమారుగా 17 లక్షల రూపాయలు. సదరు ప్రయాణికులు తమ వీసా నిబంధనలను ఉల్లంఘించకుండా సమయానికి తిరిగి వారి దేశాలకు వెళ్లిపోతే ఈ మొత్తాన్ని పూర్తిగా వాపసు చేస్తారు.

ఇండియాకు కాస్త సడలింపు, అయినా కష్టాలు

ఒక్కరోజు గడువు ముగిసినా అంతా నష్టమే. ఈ జాబితాలో 50 దేశాలున్నాయి. వాటిలో అధిక శాతం ఆఫ్రికన్ దేశాలే. అంతేకాదు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయన్నది అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ మాట. కొత్త విధానం వెనుక వీసా ఓవర్‌ స్టే సమస్యను అరికట్టడమేనని అక్కడి అధికారుల చెబుతున్నారు. పర్యాటక వీసాలపై అమెరికా వెళ్లి గడువు తీరిపోయినా చట్టవిరుద్ధంగా ఉండిపోతున్న వారి సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవాళ్లు లేకపోలేదు.

Advertisement

దీనివల్ల చట్టబద్ధంగా ప్రయాణించే పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపుతోందని విమర్శిస్తున్నారు మానవ హక్కుల సంఘాల నేతలు. కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్‌పై చాలా మంది భారతీయులు, ఎన్నారైల్లో ఆందోళన నెలకొంది. ఈ జాబితాలో భారత్ పేరు లేకపోవడంతో కాస్త ఉపశమనం.  భారత్ నుంచి అమెరికాకు బిజినెస్, టూరిస్ట్ వీసాల మీద వెళ్లాలనుకునే వారు 20 వేల డాలర్ల బాండ్‌ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పద్ధతిలో వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ALSO READ: 24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

పర్యాటక వీసాల విషయంలో భారత్‌కు మినహాయింపు దక్కినప్పటికీ ఇతర వీసాల విషయంలో నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ విజిటర్స్,పరిశోధకుల కోసం జే-వన్ వీసాల విషయంలో కాంప్లియెన్స్ రూల్స్ తీసుకురావాలన్నది ట్రంప్ ప్రభుత్వం ఆలోచన. వీసా స్టేను ఉల్లంఘిస్తే దాన్ని రద్దు చేసే అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థి వీసాపై వెళ్లేవారు ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి తనిఖీలను ఎదుర్కోవడం ఖాయం. మొత్తానికి అమెరికాకు వచ్చేవారికి రూల్స్ కఠినంగా మార్చేస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్.

Related News

సూడాన్‌లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!

ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్‌లైన్!

సౌదీకి మరో బంగారు పంట.. భారీగా యురేనియం నిక్షేపాలు గుర్తింపు

న్యూయార్క్‌ సబ్‌వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. భారత సంతతి మహిళ, ఆమె ఫ్రెండ్‌పై దూసుకెళ్లిన రైలు

బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

Big Stories

Advertisement
×