E-Paper
Advertisement

మళ్లీ మొదలెట్టావా నాగవంశీ..!

మళ్లీ మొదలెట్టావా నాగవంశీ..!
Advertisement

Naga Vamsi”ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొడుతుంది…””ఈ సినిమాకి మొదటి రోజు వచ్చే కలెక్షన్స్ మామూలుగా ఉండవు..””ఈ సినిమాతోనే హీరో లైఫ్ మారిపోతుంది..””ఇదే నా కెరీర్‌లో ద బెస్ట్ సినిమా..”ఇలా సినిమా రిలీజ్ దగ్గరపడే కొద్దీ మేకర్స్ సినిమాను ఆకాశానికి ఎత్తడం మనం చూస్తూనే ఉంటాం.ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు నాగ వంశీ.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై నాగ వంశీ భారీ కామెంట్స్

అవును.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆడియో లాంచ్‌లో నాగ వంశీ చేసిన కామెంట్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి మరి.”ఇందులో సూర్య నటించిన తీరు మీకు ‘గజినీ’లోని సంజయ్ రామస్వామిని గుర్తు చేస్తుంది.””ఇక ‘అలవైకుంఠపురంలో’ ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందో.. ఈ సినిమా తమిళంలో ఆ రేంజ్ సక్సెస్ అవుతుంది.””ఇక జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్‌కి థియేటర్లు దద్దరిల్లుతాయి.”ఇలా సినిమాపై ఎక్కడలేని అంచనాలు పెంచేశాడు ఈ టాలీవుడ్ చింటూ.

అంచనాలు పెంచడం మంచిదే.. కానీ?

Advertisement

నిజానికి సినిమాపై అంచనాలు పెంచాలి. అది న్యాయమే కూడా.కానీ ఇలానే అన్ని సినిమాలకి ఊదరగొట్టడం.. ఆ తర్వాత అవి బాక్సాఫీస్ వద్ద కళ్లుతేలిస్తేనే అసలు సమస్య వస్తుంది.

ఇప్పటి ఆడియన్స్‌ను తక్కువ అంచనా వేయొద్దు

ఎందుకంటే ఇప్పుడున్న ఆడియన్స్‌ని అంత ఆషామాషీగా తీసుకోవద్దు.ఆవులిస్తే అమాంతం లెక్కేస్తారు.ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడారు అన్న ప్రతిదాన్ని కట్ చేసి మరీ సేవ్ చేసుకుంటారు.సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా ఆ క్లిప్‌ని సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేస్తారు.

‘సంజయ్ రామస్వామి’తో పోల్చడం రిస్క్ కాదా?

Advertisement

నిజానికి సంజయ్ రామస్వామి అనే పాత్రతో నాగ వంశీ పోల్చడమే పెద్ద రిస్క్.ఎందుకంటే సూర్య చేసిన ఆ రోల్ ఒక ఐకానిక్.మళ్లీ అలాంటి పాత్రతో పోలిస్తే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి.ఇక థియేటర్‌లోకి వెళ్లిన ఆడియన్స్ ఆ పాత్రను సంజయ్ రామస్వామితో పోల్చుకోవడం పక్కా.అది గనక ఏమాత్రం తేడా కొట్టినా.. మళ్లీ నాగ వంశీ ట్రోలర్స్‌కి మాంచి స్టఫ్ అవడం ఖాయం.

‘అలవైకుంఠపురంలో’తో పోలిక 

మరోవైపు ‘అలవైకుంఠపురంలో’ సినిమాతో పోల్చడం కూడా చిన్న విషయం ఏమీ కాదు.ఆ సినిమా అటు క్లాస్.. ఇటు మాస్‌ని గంపగుత్తగా ఆకట్టుకుంది.అలాంటి బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌తో ఈ సినిమాను కంపేర్ చేశాడంటే ప్రేక్షకులు కూడా అదే రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు.సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా నాగ వంశీ చెప్పిన మాటలు నెట్‌లో చక్కర్లు కొట్టడం ఖాయం.

స్పీచ్‌లు వైరల్.. రిజల్ట్ తర్వాత అసలైన పరీక్ష

నిజానికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా.. వదులుతున్న అప్‌డేట్స్ ఏమైనా.. ఈవెంట్లలో వదిలే స్పీచ్‌లు మాత్రం తెగ వైరల్ అయిపోతున్నాయి.రిలీజ్ అయ్యాక వచ్చే రివ్యూల కంటే ముందే ఈ స్పీచ్‌లే బయటకు వచ్చేస్తున్నాయి.

also read:చిన్న ఊళ్లలో పీవీఆర్.. ఇక పాత థియేటర్లకు గుడ్‌బైనా?

చివరికి తీర్పు చెప్పేది ప్రేక్షకులే

సో.. సినిమా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పాల్సిన పని లేదు.సినిమా ఏమాత్రం బాగున్నా ప్రేక్షకులే తల మీద పెట్టుకొని ఊరేగిస్తారు.కానీ అదే ప్రేక్షకులు సినిమా ఏ మాత్రం బోల్తా కొట్టినా ఏకిపారేస్తారు అన్న విషయం మాత్రం మరవకూడదు.

Tags

Related News

చిన్న ఊళ్లలో పీవీఆర్.. ఇక పాత థియేటర్లకు గుడ్‌బైనా?

ఈసారి అయినా హిట్ కొడతావా నితిన్?

రష్మికకు ఏం జరిగింది?.. ఇన్‌స్టా పోస్ట్‌తో అసలు నిజం బయటకు!

టార్చర్ పెట్టకండి.. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అభ్యర్థన!

హీరోయిన్‌గా నందమూరి తేజస్విని.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

చిన్న విషయాలకే వణికిపోయే స్టార్ హీరోయిన్లు వీళ్లే!

పాన్ ఇండియా స్టార్ కావాలంటే.. ఇప్పుడు కత్తి పట్టాల్సిందేనా?

Big Stories

Advertisement
×