E-Paper
Advertisement

20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. దద్దరిల్లిన దుబాయ్‌ నగరం, ఎవరి పని?

20 నిమిషాల్లో  7 పేలుళ్లు.. దద్దరిల్లిన దుబాయ్‌ నగరం, ఎవరి పని?
Advertisement

Dubai: అమెరికా-ఇరాన్ మధ్య గడిచిన నాలుగు రోజులుగా దాడులు ఆగిపోయాయి. అయినా సరే గల్ఫ్‌లోని పలు ప్రాంతాల్లో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దుబాయ్‌లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతం వరుస బాంబు దాడులతో దద్దరిల్లింది. 20 నిమిషాల్లో 7 పేలుళ్లు చోటు చేసుకున్నాయో అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అర్థరాత్రి  పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్‌ నగరం

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రధాన నగరం దుబాయ్‌కు సమీపంలోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 7 బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుళ్ల కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అంతా వ్యాపించాయి. పారిశ్రామిక ప్రాంతం పక్కన ప్రపంచంలో అతి పెద్ద నౌకాశ్రయం ఉంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు. పేలుళ్లకు గల కారణాన్ని వెల్లడించలేదు. ఈ ఘటనకు సంబంధించి వీడియో చిత్రీకరించిన ఇద్దర్ని అరెస్టు చేశారు. వాటికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

20 నిమిషాల్లో 7 పేలుళ్లు, ఎవరి పని

Advertisement

వరుస పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసి ఉండటం కనిపించింది. పేలుళ్ల తర్వాత దుబాయ్‌లోని ఓడరేవుకు ఆనుకుని ఉన్న ఆయిల్ నిల్వ, రవాణా కోసం ఉపయోగించే ఓ గిడ్డంగిలో మంటలు చెలరేగాయి. ఉపగ్రహ చిత్రాలు వాటిని చూపిస్తున్నాయి. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కొన్నివర్గాలు ఆ శబ్దాలను వైమానిక దాడులకు ఆపాదించగా, యెమెన్ నుండి ప్రయోగించిన క్షిపణుల వల్ల సంభవించాయని పేర్కొన్నాయి. యెమెన్ రాజధాని సనాలో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.

ఇరాన్ మీడియా ఏం చెప్పింది?

పేలుళ్ల వెనక హూతీల హస్తం ఉందని ఇరాన్‌ అధికారిక మీడియా ప్రకటన చేసింది. అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతల సమయంలో యూఏఈ అత్యంత అప్రమత్తంగా ఉంది. ఈ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాలపై టెహ్రాన్ జరిపే ప్రతీకార దాడులలో ఇది లక్ష్యంగా ఉంటోంది. దుబాయ్‌కి నైరుతి దిశలో జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతం ఉంది. ఇది కీలకమైన లాజిస్టిక్స్, వాణిజ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో జెబెల్ అలీ పోర్ట్, జెబెల్ అలీ ఫ్రీ జోన్ ఉన్నాయి. 1985లో స్థాపించిన ఓ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం, 150కి పైగా దేశాలకు చెందిన 11 వేలకు పైగానే కంపెనీలు అక్కడ ఉన్నాయి.

Advertisement

ALSO READ: ఎర్ర సముద్రంలో ఏం జరిగింది? భారత వాణిజ్య నౌకపై దాడి, ఇది ఎవరి పని?

 

Related News

రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్‌కు 100% టారిఫ్ ముప్పు.. విదేశాంగ శాఖ రియాక్షన్ ఇదే!

పాకిస్థాన్‌లో ఘోరం.. మసీదు వద్ద ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి!

లాక్‌డౌన్ దిశగా పాకిస్థాన్ అడుగులు.. ఆ తరహా ఆంక్షలు, పెళ్లిళ్లలో ఒకే వంటకం

రష్యా చమురుపై అమెరికా బిగ్ ట్విస్ట్.. భారత్ వ్యూహం ఏంటి?

రష్యాని అష్టదిగ్భందం చేసిన అమెరికా.. చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై 100 శాతం పన్ను, అధికారాలు ట్రంప్‌కే

సూడాన్‌లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!

ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్‌లైన్!

సౌదీకి మరో బంగారు పంట.. భారీగా యురేనియం నిక్షేపాలు గుర్తింపు

Big Stories

Advertisement
×