E-Paper
Advertisement

పొద్దుతిరుగుడు పువ్వు నిజంగానే సూర్యుడి వైపు తిరుగుతుందా? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా!

పొద్దుతిరుగుడు పువ్వు నిజంగానే సూర్యుడి వైపు తిరుగుతుందా? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా!
Advertisement

Sunflower Facts: పొద్దుతిరుగుడు పువ్వు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతేకాదు, సూర్యుడి వైపు తిరిగే దాని ప్రత్యేకత గురించి కూడా చాలా మందికి తెలుసు. చిన్నప్పటి నుంచి ఈ పువ్వు సూర్యుడు ఎటు ఉంటే అటువైపే తిరిగి చూస్తుందని పెద్దలు చెప్తుంటారు. అయితే, నిజంగానే పొద్దుతిరుగుడు పువ్వు రోజంతా సూర్యుడి వైపు తిరుగుతుందా? పొద్దు ఎటువైపు వెళ్తే అది కూడా అటువైపే చూస్తుందా? లేదంటే ఇది కేవలం అపోహేనా? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన సమాధానం చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సూర్యరశ్మికి అనుగుణంగా కదలడం!

పొద్దుతిరుగుడు మొక్క నుంచి లభించే గింజలతో తయారయ్యే సన్‌ ఫ్లవర్ ఆయిల్ ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పంట బాగానే సాగవుతుంది. అయితే, ఈ మొక్కకు ఉన్న మరో ప్రత్యేకత సూర్యరశ్మికి అనుగుణంగా కదలడం. సైన్స్ పరిభాషలో దీనిని ఫోటోట్రోపిజం అంటారు. అంటే, కాంతికి అనుగుణంగా  మొక్క తన దిశను మార్చుకోవడం.

Advertisement

నిజానికి మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి సూర్యరశ్మి అనేది అత్యంత కీలకం. అందుకే ఎక్కువ వెలుతురు అందేలా పొద్దుతిరుగుడు మొక్క తన కాండాన్ని క్రమంగా వంచుకుంటుంది. ఈ ప్రక్రియలో ఆక్సిన్ అనే గ్రోథింగ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యరశ్మి తక్కువగా పడే భాగంలో ఈ హార్మోన్ ఎక్కువగా చేరి, ఆ వైపు కణాలు వేగంగా పెరిగేలా చేస్తుంది. దీంతో పువ్వు సూర్యుడి వైపు తిరుగుతున్నట్లు కనిపిస్తుంది.

అయితే, ఈ లక్షణం మొక్కకు జీవితాంతం ఉండదు. చిన్న వయసులో ఉన్న పొద్దుతిరుగుడు మొక్కలు మాత్రమే ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడి వైపు తిరుగుతూ ఉంటాయి. పువ్వు పూర్తిగా వికసించి పరిపక్వ దశకు చేరుకున్న తర్వాత ఎక్కువగా తూర్పు దిశలోనే స్థిరంగా ఉంటుంది. ఉదయాన్నే వచ్చే సూర్యరశ్మిని త్వరగా పొందడం, తేనెటీగలు లాంటి పరాగసంపర్క కీటకాలను ఆకర్షించడం ఇందుకు ప్రధాన కారణాలని పరిశోధనలు చెబుతున్నాయి.

పురాణాల్లో ఆసక్తికర ప్రేమ కథ!   

Advertisement

పొద్దుతిరుగుడు పువ్వు గురించి గ్రీకు పురాణాల్లో కూడా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఆ కథ ప్రకారం క్లైటీ అనే యువతి సూర్యదేవుడైన హీలియోస్‌ ను ఇష్టపడుతుంది. ఎంతగానో ప్రేమిస్తుంది. ఆమె ప్రేమ ఫలించకపోవడంతో జీవితాంతం సూర్యుడినే చూస్తూ ఉండేదని, చివరకు పొద్దుతిరుగుడు పువ్వుగా మారిపోయిందని చెబుతారు. అందుకే, ఈ పువ్వు ఎప్పుడూ సూర్యుడి వైపే చూస్తుందని ఆ కథ ప్రచారంలో ఉంది.

సో, పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరగడం వెనుక ఎలాంటి మాయ, మర్మం లేదు. ఫోటోట్రోపిజం, ఆక్సిన్ హార్మోన్ ప్రభావం, సూర్యరశ్మిని ఎక్కువగా పొందాలనే సహజ ప్రక్రియ కలిసి ఈ లక్షణాన్ని అందించాయి. అందుకే ప్రకృతిలో అత్యంత ఆసక్తికరమైన మొక్కల్లో పొద్దుతిరుగుడు పువ్వు ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

Tags

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×