E-Paper
Advertisement

ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు, ఒప్పందంలోని కీలక అంశాలివే

ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు,  ఒప్పందంలోని కీలక అంశాలివే
Advertisement

Paris:  దాదాపు నాలుగు నెలల తర్వాత ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసింది. పారిస్ వేదికగా ఇరుదేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఇరుదేశాల అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా 14 అంశాలు అమల్లోకి రానున్నాయి. ఇంతకీ అందులోకి కీలక అంశాల మాటేంటి?

ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్

Advertisement

ఎట్టకేలకు 110 రోజుల తర్వాత ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఎంవోయూ కుదిరింది. బుధవారం రాత్రి పారిస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తాత్కాలిక శాంతి ఇప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో 14 అంశాలను పొందుపరిచినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

దాని ప్రకారం.. 60 రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. వీలు కాని పక్షంలో ఇరుదేశాల అంగీకారంతో గడువు పొడిగించవచ్చు. రెండోది ఇరాన్-అమెరికా మధ్య అన్ని యుద్ధ చర్యలు నిలిపి వేయనున్నారు. లెబనాన్‌లో ఘర్షణలు ఇందులో ఓ భాగంగా కూడా. మూడోది.. ఇరు దేశాలు వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని అంగీకరించినట్టు తెలుస్తోంది.

Advertisement

పారిస్ వేదికగా ఇరుదేశాల ఒప్పందంపై ట్రంప్ సంతకం 

హోర్మూజ్ జలసంధిపై అమెరికా విధించిన నిర్భందానని పూర్తిగా ఎత్తివేయనుంది. అది కూడా కేవలం 30 రోజుల్లో మాత్రమే. అయితే శాశ్వత ఒప్పందం తర్వాత ఇరాన్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరగనున్నాయి. దీనికితోడు హోర్మూజ్ జలసంధిలో నౌకా రవాణాకు ఎలాంటి రుసుము లేకుండా భద్రత కల్పిస్తుందని స్పష్టమైన హామీ ఇరాన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

దీనికితోడు ఇరాన్ పునర్ నిర్మాణానికి 300 బిలియన్ డాలర్లు విలువైన అభివృద్ది ప్రణాళికకు అమెరికా సహకరించనున్నట్లు తెలుస్తోంది. నేరుగా అమెరికా నిధులు ఇవ్వబోదని అక్కడి అధికారులు చెప్పుకొచ్చారు. శాశ్వత ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికాతోపాటు ఐక్యరాజ్యసమితిలో ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అమెరికా.

ALSO READ: నెతన్యాహుపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. ‘నేనే లేకపోతే ఇజ్రాయెల్ సర్వనాశనమయ్యేది’

ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదన్నది ప్రధాన హామీ. ప్రస్తుతమున్న యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆధ్వర్యంలో తొలగించేందుకు ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ ముడిచమురు ఎగుమతులకు అమెరికా మినహాయింపు ఇచ్చింది. అయితే బ్యాంకింగ్, బీమా, రవాణా రంగాల సేవలపై సడలింపులు ఉండనున్నాయి.

అంతా అనుకున్నట్లుగా జరిగితే అమెరికా ఇప్పటివరకు స్తంభింప జేసిన కొన్ని విదేశీ నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. ఒప్పందాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నాయి. తాత్కాలిక ఒప్పందం కావడంతో ఇకపై శాశ్వత ఒప్పందంపై చర్చలు మొదలుకానున్నాయి. ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదం చేసి అమలు చేయనున్నారు.

 

Related News

రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్‌కు 100% టారిఫ్ ముప్పు.. విదేశాంగ శాఖ రియాక్షన్ ఇదే!

పాకిస్థాన్‌లో ఘోరం.. మసీదు వద్ద ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి!

లాక్‌డౌన్ దిశగా పాకిస్థాన్ అడుగులు.. ఆ తరహా ఆంక్షలు, పెళ్లిళ్లలో ఒకే వంటకం

రష్యా చమురుపై అమెరికా బిగ్ ట్విస్ట్.. భారత్ వ్యూహం ఏంటి?

రష్యాని అష్టదిగ్భందం చేసిన అమెరికా.. చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై 100 శాతం పన్ను, అధికారాలు ట్రంప్‌కే

సూడాన్‌లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!

ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్‌లైన్!

సౌదీకి మరో బంగారు పంట.. భారీగా యురేనియం నిక్షేపాలు గుర్తింపు

Big Stories

Advertisement
×