E-Paper
Advertisement

ఇది కలా? నిజమా?.. కళ్లు లేకపోయినా చూడొచ్చట.. మస్క్ కొత్త ‘చిప్’ మాయాజాలం!

ఇది కలా? నిజమా?.. కళ్లు లేకపోయినా చూడొచ్చట.. మస్క్ కొత్త ‘చిప్’ మాయాజాలం!
Advertisement

Neuralink Blindsight: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘న్యూరాలింక్’.. మరో సంచలనాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చూపు లేనివారికి తిరిగి దృష్టిని అందించడమే లక్ష్యంగా ‘బ్లైండ్‌సైట్’ (Blindsight) అనే వినూత్న ‘విజన్ ఇంప్లాంట్ చిప్’ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాబోయే 6 నుండి 12 నెలల వ్యవధిలోనే ఈ ప్రయోగాలకు సంబంధించిన తొలి మానవ పరీక్షలను (Human Clinical Trials) ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

బ్లైండ్‌సైట్ ఎలా పనిచేస్తుంది?

కంటి చూపు కోల్పోయిన వారికి సాధారణంగా కళ్లు లేదా ఆప్టిక్ నరాలు దెబ్బతింటాయి. అయితే న్యూరాలింక్ ప్రవేశపెడుతున్న ఈ ‘బ్లైండ్‌సైట్’ పరికరం దెబ్బతిన్న కళ్లతో లేదా ఆప్టిక్ నరాలతో సంబంధం లేకుండా సమాచారాన్ని నేరుగా మెదడులోని విజువల్ కార్టెక్స్ (Visual Cortex) విభాగానికి చేరవేస్తుంది. పుట్టుకతోనే దృష్టి లోపం ఉన్నవారికి కూడా దీని ద్వారా చూపును తీసుకురావచ్చని మస్క్ చెబుతున్నారు.

Advertisement

ప్రత్యేకమైన రికార్డింగ్ కళ్లజోడు

అయితే అంధుల్లో బాహ్య దృశ్యాలను కళ్లు నేరుగా చూడలేవు కాబట్టి.. వాటిని రికార్డ్ చేసేందుకు ప్రత్యేకమైన కళ్లద్దాలు లేదా హెడ్ సెట్ లాంటిది ధరించాల్సి ఉంటుంది. ఆ స్మార్ట్ కళ్లజోడు ద్వారా రికార్డయ్యే విజనరీ ఎలక్ట్రోమాగ్నటిక్ సిగ్నల్స్.. నేరుగా విజన్ ఇంప్లాంట్ చిప్ కు చేరతాయి. అక్కడి నుంచి మెదడులోని విజువల్ కార్టెక్స్ చేరి.. అంధులు కళ్లు లేనప్పటికీ చూడగలగనున్నారు. ఇప్పటికే ఈ సాంకేతికతకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నుండి ‘బ్రేక్‌త్రూ డివైజ్’ హోదా లభించడం దీని ప్రాధాన్యతను సూచిస్తోంది.

ప్రారంభంలో తక్కువ నాణ్యతతో గ్రాఫిక్స్

Advertisement

బ్లైండ్‌సైట్ ద్వారా తొలి విడతలో అందించే దృష్టి నాణ్యత చాలా ప్రాథమిక స్థాయిలో ఉంటుందని మస్క్ స్పష్టం చేశారు. ప్రారంభంలో ఇది పాతకాలపు రెట్రో వీడియో గేమ్ గ్రాఫిక్స్ మాదిరిగా, చాలా తక్కువ రిజల్యూషన్‌తో ఆకృతులను మాత్రమే చూపించగలదు. అయితే రాబోయే రోజుల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లలో వచ్చే మార్పులతో ఈ విజన్ రిజల్యూషన్ క్రమంగా పెరుగుతుందని, ఒక దశలో సాధారణ మానవ దృష్టి కన్నా మెరుగైన నాణ్యతను అందుకుంటుందని మస్క్ పేర్కొన్నారు.

‘సూపర్‌హ్యూమన్ విజన్’

మానవుడి కళ్లు చూడలేకపోయే కిరణాలను కూడా బ్లైండ్‌సైట్ ద్వారా చూడవచ్చని మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా మన కంటికి కనిపించని ఇన్ఫ్రారెడ్ (Infrared), ఆల్ట్రావయోలెట్ (Ultraviolet) తరంగాలతో పాటు రాడార్ తరంగాలను కూడా మెదడు గ్రహించేలా ఈ పరికరాన్ని తీర్చిదిద్దవచ్చని ఆయన తెలిపారు. సాంకేతికంగా ఇది సాధ్యమైతే, మానవ దృష్టి పరిమితులను దాటి సరికొత్త ‘సూపర్‌ హ్యూమన్’ అనుభూతిని పొందవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు.

Also Read: అమెజాన్ బంపరాఫర్.. మోటో ఫోన్‌పై ఏకంగా రూ.17,000 డిస్కౌంట్.. గోల్డెన్ ఛాన్స్ వదులుకోకు భయ్యా!

నిపుణుల హెచ్చరికలు – సవాళ్లు

మస్క్ వ్యాఖ్యలపై టెక్ లోకం హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ నరాల వైద్య నిపుణులు (Neuroscientists) మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మెదడును నేరుగా ప్రేరేపించి దృష్టిని అందించడం అనేది చాలా సంక్లిష్టమైన వైజ్ఞానిక ప్రక్రియ అని పేర్కొంటున్నారు ఇది ఆచరణలోకి రావడానికి ఇంకా ఏళ్లు పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో సూపర్ పవర్స్ తీసుకురావడం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమేనని.. దానికి శాస్త్రీయ ఆధారాలు ఇంకా పూర్తిస్థాయిలో లభించలేదని వివరిస్తున్నారు.

Also Read: BSNL రూ. 485 vs Jio రూ. 749.. 72 రోజుల వ్యాలిడిటీ.. సామాన్యులకు ఏ ప్లాన్ బెస్ట్?

Tags

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×