E-Paper
Advertisement

UAE Drone Show: ఆకాశాన్ని తాకేలా న్యూఇయర్ వేడుకలు.. డ్రోన్ షో, ఫైర్ వర్క్స్‌లో యూఏఈ గిన్నీస్ రికార్డ్

UAE Drone Show: ఆకాశాన్ని తాకేలా న్యూఇయర్ వేడుకలు.. డ్రోన్ షో, ఫైర్ వర్క్స్‌లో యూఏఈ గిన్నీస్ రికార్డ్
Advertisement

UAE Drone Show: యూఏఈలో న్యూ ఇయర్ వేడుకలను అత్యద్భుతంగా నిర్వహించారు. ఫైర్ వర్స్, డ్రోన్ ప్రదర్శనలతో 5 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో మల్టీరోటర్లు/డ్రోన్లతో రూపొందించిన ఫీనిక్స్ అతిపెద్ద వైమానిక ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుందని రసల్ ఖైమా ధృవీకరించింది. నూతన సంవత్సర పండుగ సందర్భంగా ఐదు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దుబాయ్, అబుదాబి, రస్ అల్ ఖైమా సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో వేడుకలు నిర్వహించారు.

6,500 డ్రోన్లతో రికార్డు

దాదాపు 6,500 డ్రోన్లు 20 నిమిషాల పాటు డ్రోన్ షో నిర్వహించారు. మ్యూజిక్, బాణాసంచాతో 2026 కి కౌంట్‌డౌన్ చేస్తూ ఫీనిక్స్ రూపంలో డ్రోన్ల ప్రదర్శనం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను నెలకొల్పాయి. అల్ మార్జన్ ద్వీపం నుంచి అల్ హమ్రా ద్వీపం వరకు తీరం వెంబడి 15 నిమిషాల డ్రోన్ షో నిర్వహించారు.

Advertisement

అబుదాబిలోని అల్ వాత్బాలోని షేక్ జాయెద్ ఉత్సవం నూతన సంవత్సర వేడుకలలో ప్రధానంగా నిలిచింది. బుధవారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమై డ్రోన్ షో, బాణసంచా, ఇతర కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. 62 నిమిషాల పాటు నిరంతర బాణసంచా ప్రదర్శన అంబరాన్ని తాకాయి.

దుబాయ్ లో 40 చోట్ల

Advertisement

దుబాయ్ వ్యాప్తంగా వేడుకలు నిర్వహించింది. బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్, అట్లాంటిస్ ది పామ్, గ్లోబల్ విలేజ్, ఎక్స్‌పో సిటీ దుబాయ్, హట్టాతో సహా 40 ప్రదేశాలలో మొత్తం 48 బాణసంచా ప్రదర్శనలు జరిగాయి. షార్జా అల్ మజాజ్ వాటర్‌ఫ్రంట్, అల్ హీరా బీచ్, ఖోర్ఫక్కన్ బీచ్‌లలో 10 నిమిషాల బాణాసంచా ప్రదర్శనలు నిర్వహించారు.

Also Read: దుబాయ్ ఎయిర్‌ షోలో ప్రమాదం.. కుప్పకూలిన యుద్ధ విమానం, పైలట్ మృతి

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×